MLC Kavitha : ఈడీ నోటీసులు.. మరోసారి సుప్రీంకోర్టుకు కవిత, ఊరట దక్కేనా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లనున్నారు. తమ పిటిషన్ పైన అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుని కోరనున్నారు. ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

MLC Kavitha : ఈడీ నోటీసులు.. మరోసారి సుప్రీంకోర్టుకు కవిత, ఊరట దక్కేనా?

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రేపు(మార్చి 17) మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లనున్నారు. తమ పిటిషన్ పైన అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుని కోరనున్నారు. ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

ఈడీ.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈడీ నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ఇప్పటికే కవిత పిటిషన్ వేశారు. కవిత వేసిన పిటిషన్ పైన ఈ నెల 24న విచారణ జరుపుతామని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, 20న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో.. కవిత మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లాలని నిర్ణయించారు.

Also Read..MLC Kavitha-Delhi liquor Scam: మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించకూడదు: ఎమ్మెల్సీ కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే ఓ మారు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. దీంతో కవిత కోర్టుని ఆశ్రయించారు. మహిళల ఈడీ విచారణపైన సుప్రీంకోర్టులో విచారణ జరపాలని, ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ కవిత.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈడీ విచారణకు సైతం ఆమె హాజరవ్వలేదు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, కవిత అభ్యర్థనను పరిగణలోకి తీసుకోని ఈడీ.. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు పంపింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరిపించాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకి విన్నవించనున్నారు. మరి కవితకు ఊరట దక్కుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.