Droupadi murmu: నిరాడంబరతే ద్రౌపదీ ముర్మును ప్రజలకు దగ్గర చేసింది..

దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అదిష్టించనున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించడంతో 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

Droupadi murmu: నిరాడంబరతే ద్రౌపదీ ముర్మును ప్రజలకు దగ్గర చేసింది..

Dropadi Murmu

Droupadi murmu: దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అదిష్టించనున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించడంతో 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశంలో ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న రెండో మహిళగా ద్రౌపదీ ముర్ము ఘనత సాధించారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో జన్మించారు. ఆమెది చిన్ననాటి నుండి నిరాడంబరమైన జీవితమే.

Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం

ఝార్ఖండ్ సరిహద్దులోని పహర్ధాపూర్ గ్రామంలో 80శాతం సంతాల్ తెగ వారే ఉండేవారు. ఆ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ముర్ముకు చదువుకోవటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. తల్లిదండ్రులు నెలకు రూ.10 ఇవ్వగా.. తమ ఊరి నుంచి భవనేశ్వర్ కు వెళ్లి కాలేజీ విద్యను పూర్తి చేసింది. 1997లో రాజకీయాల్లోకి వచ్చిన ద్రౌపది ముర్ము.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగానూ పనిచేశారు. 2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

Vice Presidential Polls: విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు టీఎమ్‌సీ దూరం

ఆమె పదవీకాలం పూర్తవడంతో తిరిగి తమ స్వస్థలమైన రాయ్ రంగ్ పూర్ తిరిగివెళ్లి భర్త కట్టించిన ఐదు గదుల ఇంట్లోనే ఉంటున్నారు. ఉన్నత పదవులను అదిరోహించినప్పటికీ అతి సాధారణమైన జీవితాన్ని కొనసాగించారు ముర్ము. నిత్యం పేద వర్గాల ప్రజలకు దగ్గరగా ఉంటూ తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఆమె నిరాడంబరతను చూసి మధ్య తరగతి ప్రజలు, పేదలు ఎక్కువగా ఆమెను ఇష్టపడేవారు.