MSRTC : 6 వేల ఆర్టీసీ ఉద్యోగుల సస్పెండ్

శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ..సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది.

MSRTC : 6 వేల ఆర్టీసీ ఉద్యోగుల సస్పెండ్

Msrtc

MSRTC Suspended : ప్రజా రవాణాలో ఆర్టీసీ సంస్థ కీలకం. ఏ రాష్ట్రంలోనైనా..ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే..కొన్ని కొన్ని సమస్యలు సంస్థల్లో తలెత్తుతుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె చేయడం, ఆందోళన చేయడం వంటివి చూస్తుంటాం. అనంతరం సంస్థ యాజమాన్యం వారితో చర్చించి..సమస్యల పరిష్కారం అయ్యేందుకు చొరవ తీసుకుంటాయి. కానీ..ఓ నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తొలుత కొంతమంది ఉద్యోగులను సస్పెండ్, మరికొంతమందిని విధుల నుంచి తొలగించినా ఉద్యోగులు వెనకడుగు వేయలేదు. దీంతో మరికొంతమందిపై వేటు వేసింది ఆర్టీసీ సంస్థ.

Read More : Stop Flights: “విమానాలను ఆపేయండి”.. ప్రధానమంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ

రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ…మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ..సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఉద్యోగుల సంఖ్య 6 వేల 277 కి చేరుకుంది. 1496 మంది ఉపాధి కోల్పోయారు.

Read More : PM Modi: నా గోల్ అదే.. కరోనా మహమ్మారిపై మోదీ ప్రకటన!

మరోసారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి..ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. సమ్మె విరమించి..వెంటనే విధుల్లో చేరాలని..లేనిపక్షంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ హెచ్చరికలతో మొత్తం 92 వేల 266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 18 వేల మంది శనివారం విధుల్లో తిరిగి చేరినట్లు… అందరూ చేరాల్సిందేనని ఇందుకు ఆదివారం వరకు గడువు ఇవ్వడం జరిగిందని అధికారులు వెల్లడించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనంతో పాటు…జీతాల పెంపు విషయంలో సమీక్షించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంపు ప్రకటించడం జరిగిందని, పలువురు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.