PM Modi: నా గోల్ అదే.. కరోనా మహమ్మారిపై మోదీ ప్రకటన!

నా గోల్(లక్ష్యం) ప్రజలకు సేవ చేయడమే కాని, పవర్‌లో ఉండడం కాదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.

PM Modi: నా గోల్ అదే.. కరోనా మహమ్మారిపై మోదీ ప్రకటన!

Modi

PM Modi: నా గోల్(లక్ష్యం) ప్రజలకు సేవ చేయడమే కాని, పవర్‌లో ఉండడం కాదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతీ ఒక్కరి జీవితం ఎలా మారిపోయింది? ఆ మారిన జీవితం అనుభవం ఏమిటి? అనేది తెలుసుకున్నప్పుడే మనస్సుకు సంతృప్తిగా అనిపిస్తుందని అన్నారు మోదీ.

83వ ‘మన్ కీ బాత్'(మనసులో మాట) కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. కరోనా మహమ్మారి విషయంలో కూడా కీలక ప్రకటన చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు ప్రధాని.

కోవిడ్-19 మహమ్మారి అంతమైందనే భ్రమలో కొందరు ఉన్నారని, కరోనా మహమ్మారి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ని గుర్తించడంపై ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు మోదీ.

దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో ఒమిక్రాన్‌ను గుర్తించగా.. ఇది వేగంగా వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. ఒమిక్రాన్‌ వైరస్‌ పట్ల ప్రస్తుతానికి భయం అక్కర్లేదని, కరోనా జాగ్రత్తలు మాత్రం ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు.

ఇదే సమయంలో పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ 1971 డిసెంబరు 16వ తేదీన విజయం సాధించగా.. ఈ విజయానికి సంబంధించి 50వ వార్షికోత్సవం డిసెంబరు 16వ తేదీన జరుపుకోనున్నట్లు చెప్పారు మోదీ.