MAA Election: భారీగా నాగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రకాష్‌రాజ్ టీమ్ నుండి ఆహ్వానాలు!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు క్రమశిక్షణ కమిటీ ‘మా’ ఎన్నికల తేదీని ఖరారు చేసింది.

MAA Election: భారీగా నాగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రకాష్‌రాజ్ టీమ్ నుండి ఆహ్వానాలు!

Maa Election

MAA Election: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు క్రమశిక్షణ కమిటీ ‘మా’ ఎన్నికల తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. తేదీ ప్రకటన జరిగిపోవడంతో ఆశావహులు పావులు కదపపడం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటివరకూ మా ఎన్నికల కోసం రెండు వర్గాల మధ్య పోటాపోటీ పెరిగి సాధారణ రాజీయ ఎన్నికలను తలపించేలా హీట్ పెంచేశాయి.

కాగా, ఇప్పుడు ఎవరికి వారు ఈ ఎన్నికలే టార్గెట్ గా ఇండస్ట్రీని తమవైపుకు తిప్పుకొని ప్రయత్నాల్లో ఉన్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, సీవిఎల్ నరసింహరావు, జీవితా రాజశేఖర్ అధ్యక్ష పోటీలో ఉన్నట్లు ప్రకటన చేయగా.. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల జాబితాను కూడా విడుదల చేశారు. కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికలే టార్గెట్ చేసి ఇండస్ట్రీలో బలాన్ని పెంచుకొనే పనిలో పడ్డట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సీనియర్ హీరో, ఇండస్ట్రీలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న నాగార్జున బర్త్ డేను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఈరోజే (ఆగష్టు 29) హీరో నాగార్జున పుట్టినరోజు కాగా.. ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఆఫీసులో గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారట. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఈ వేడుకకు దగ్గరుండి భారీగా ఏర్పాట్లు చేశారు. నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సమీర్ ఇప్పటికే సహనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా ఈ బర్త్ డే పార్టీకి ఆహ్వానాలు అందించడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఇండస్ట్రీ అఫ్ ది టాక్ గా మారింది. ప్రకాష్ రాజ్ అండ్ కో బయటకి కనిపించకుండా మా ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది.