Malli Pelli: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మళ్లీ పెళ్లి’.. ఆడియెన్స్ వస్తారా మళ్లీ మళ్లీ..?

టాలీవుడ్ లో ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.

Malli Pelli: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మళ్లీ పెళ్లి’.. ఆడియెన్స్ వస్తారా మళ్లీ మళ్లీ..?

Naresh Pavitra Lokesh Malli Pelli Release Date Locked

Malli Pelli: టాలీవుడ్ నటుడు నరేష్(Naresh) ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్(Pavitra Lokesh)తో రిలేషన్‌లో ఉన్న నరేష్, త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించడంతో ఈ జంట లైమ్‌లైట్‌లోకి వచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంటగా, టాలీవుడ్‌లో ఈ జోడి వార్తల్లోకెక్కింది. ఇక ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Malli Pelli : రియల్ లైఫ్ కథనే సినిమాగా తీస్తున్న నరేష్.. ‘మళ్ళీ పెళ్లి’ టీజర్‌తో మళ్ళీ షాక్ ఇచ్చిన నరేష్, పవిత్ర

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ ఎం.ఎస్.రాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. కాగా, ఈ సినిమా టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. అయితే, ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Malli Pelli: ‘మళ్ళీ పెళ్లి’ శాంపిల్ చూపెట్టేందుకు రెడీ అయిన పవిత్రా, నరేష్

‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని వేసవి కానుకగా మే 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను రీల్‌పై చూపెడుతున్న ఈ జంట, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలను ప్రస్తావిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో సాగుతోంది. ఈ జంట చేస్తున్న ‘మళ్ళీ పెళ్లి’ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు మళ్లీ మళ్లీ వస్తారా.. అంటూ పలువురు సెటైర్స్ వేస్తున్నారు.