Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ గోల్డ్ మెడల్

జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ను దాటేశాడు.

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ గోల్డ్ మెడల్

Neeraj Chopra

 

 

Neeraj Chopra: జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ను దాటేశాడు. చివరి మూడు త్రోలలో మాత్రమే రెండు ఫౌల్ అయ్యాయి.

టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా ఆడిన రెండో కాంపిటీషన్ ఇది. మిగిలిన ఇద్దరిలో వాల్కట్ 86.64మీటర్లు, 84.75మీటర్లు విసిరారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ చోప్రా శుభారంభాన్నే నమోదు చేశారు. రెండో త్రోలో కావాలనే ఫౌల్ చేసిన చోప్రా, మూడో త్రో కాస్త స్లిప్ అయి ఇక త్రో చేయకూడదన్నట్లుగా కనిపించాడు.

చోప్రాతో పాటు ట్రైనింగ్ అయిన పారా జావెలిన్ చాంపియన్ సందీప్ చౌదరి 60.35మీటర్లు విసిరి టోర్నమెంట్ లో ఎనిమిదో స్థానంతో ముగించారు.

Read Also: మరో రికార్డ్ క్రియేట్ చేసిన నీరజ్ చోప్రా

గత వారం జరిగిన పావో నర్మీ గేమ్స్ లో చోప్రా సిల్వర్ మెడల్ సాధించి తన సొంతదైన నేషనల్ రికార్డ్ 89.30మీటర్లతో బ్రేక్ చేశాడు. గతేడాది పటియాలా వేదికగా మార్చిలో జరిగిన టోర్నీలో 88.07మీటర్లు విసిరి సొంత రికార్డు లిఖించాడు.