Nithiin: మాచర్ల ఎఫెక్ట్.. సైలెన్స్ వీడని నితిన్..?

యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ కు ముందర ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో నితిన్ పాత్రను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది.

Nithiin: మాచర్ల ఎఫెక్ట్.. సైలెన్స్ వీడని నితిన్..?

Nithiin Silent After Macharla Niyojakavargam Disaster

Nithiin: యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ కు ముందర ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో నితిన్ పాత్రను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది.

Nithiin: రూపాయి ఖర్చు లేకుండా ఫుల్ పబ్లిసిటీ!

కేవలం యావరేజ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో నితిన్ తన నెక్ట్స్ చిత్రాలపై డైలామాలో పడిపోయాడు. ఏ తరహా సినిమా చేయాలి.. ఎవరితో చేయాలి అనే ఆలోచనలో నితిన్ ఉన్నాడట. అందుకే ఆయన ఇటీవల ఎక్కడా కనిపించడం లేదు. దీంతో మాచర్ల మూవీ ఎఫెక్ట్ నితిన్ పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడట ఈ హీరో.

Nithiin: సీరియల్స్‌లో నటిస్తోన్న నితిన్.. నిజమేనట!

అయితే ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ చేత రాయిస్తున్నాడట ఈ హీరో. ఆ స్క్రిప్టు పనులు పూర్తయ్యే వరకు ఇలాగే సైలెంట్ గా ఉండాలని నితిన్ భావిస్తున్నాడట. ఏదేమైనా తన నెక్ట్స్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నితిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో లేడో చూడాలి.