Nithiin: సీరియల్స్‌లో నటిస్తోన్న నితిన్.. నిజమేనట!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు ఎస్ఆర్ శేఖర్.....

Nithiin: సీరియల్స్‌లో నటిస్తోన్న నితిన్.. నిజమేనట!

Nithiin To Give Cameo In Tv Serials

Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు ఎస్ఆర్ శేఖర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nithiin: పక్కా మాస్ ట్రీట్‌గా ‘‘రా రా రెడ్డి..’’ సాంగ్!

కాగా ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు నితిన్ అండ్ టీమ్ రెడీ అవుతుండగా, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరికీ షాకిస్తూ నితిన్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. టీవీ సీరియల్స్‌లో నటించేందుకు నితిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నితిన్ టీవీ సీరియల్స్‌లో ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నటించకుండా, కేవలం ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రమోషన్స్‌లో భాగంగా కేమియో రోల్స్ మాత్రమే చేసి, తన సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తాడట.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!

ఇప్పటికే ఈ కొత్త ట్రెండ్‌ను కొందరు స్టార్స్ ఫాలో అవుతున్నారు. తమ సినిమా ప్రమోషన్స్‌ను అందరికీ రీచ్ అయ్యేలా టీవీ సీరియల్స్‌లో ఈ తరహా ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. సీరియల్స్‌లో కేమియో రోల్స్ చేసి, తమ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూనే సీరియల్‌పై ఆసక్తిని క్రియేట్ చేయడం ఈ ట్రెండ్ స్పెషాలిటీ. ఇప్పుడు నితిన్ కూడా తన మాచర్ల నియోజకవర్గం చిత్రానికి సంబంధించిన ప్రమెషన్స్‌ను ఈ విధంగా సీరియల్స్‌లో నటిస్తూ నిర్వహించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.