Nithin: హిందీ యూట్యూబ్ డబ్బింగ్ ఫిల్మ్స్.. ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్!

ఉత్తరాదిన దక్షణాది సినిమాల హవా బాగా పెరిగింది. సౌత్ నుండి మలయాళం, కన్నడ సినిమాలతో పాటు తమిళం, తెలుగు సినిమాలకు..

Nithin: హిందీ యూట్యూబ్ డబ్బింగ్ ఫిల్మ్స్.. ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్!

Nithin

Nithin: ఉత్తరాదిన దక్షణాది సినిమాల హవా బాగా పెరిగింది. సౌత్ నుండి మలయాళం, కన్నడ సినిమాలతో పాటు తమిళం, తెలుగు సినిమాలకు నార్త్ ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే బాహుబలి నుండి కేజీఎఫ్, పుష్పల వరకు మన హీరోలు అక్కడ చెలరేగిపోతున్నారు. బడా స్టార్ హీరోలు, క్రేజీ ప్రాజెక్టులు డైరెక్ట్ గా థియేటర్లలో సందడి చేస్తుంటే చోటా హీరోలు యూట్యూబ్ లో సత్తా చాటుతున్నారు.

Nithin: బన్నీ దర్శకుడితో నితిన్ కొత్త సినిమా.. మొదలయ్యేది ఎప్పుడంటే?

ఆ మధ్య యంగ్ హీరో రామ్ నేను శైలజా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకోగా తాజాగా సౌత్ లోనే హిందీ డబ్బింగ్ సినిమాలలో రామ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. తన దేవదాసు, జగడం సినిమాల ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిందీలో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చెయ్యగా వాటి అన్నిటికి కలిపి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

RaPo: సౌత్ ఇండియాలోనే ఏకైన హీరో.. ఉస్తాద్ రామ్ రికార్డు!

తాజాగా ఇప్పుడు మరో యంగ్ హీరో నితిన్ ఈ రికార్డును బ్రేక్ చేస్తూ మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి 2.3 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఘనత సాధించిన మొదటి ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్ కాగా.. ఈ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం యూట్యూబ్ ఛానెల్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ కొనుగోలు చేశాయి.