Chhattisgarh: కంఠంలో ప్రాణముండగా మద్య నిషేధం కానివ్వనన్న ఎక్సైజ్ మంత్రి.. మిగతా నాయకులు ఈయనను ఆదర్శంగా తీసుకుంటే ఏంటీ పరిస్థితి?
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు

Chhattisgarh Excise Minister Kawasi Lakhma
Chhattisgarh: అబ్కారీ మంత్రి అంటే ఆదాయపు మంత్రిత్వ శాఖ అయిపోయింది ఈ దేశంలో. ప్రజలు తమ ఆరోగ్యాలు పాడు చేసుకుని మద్యం తాగుతుంటే ప్రభుత్వాలు మద్యం సీసాల మీద వచ్చే ఆదాయాన్ని లెక్కబెట్టుకుంటున్నాయి. దీని గురించి బయటికి వేరేలా మాట్లాడినప్పటికీ జనాల నుంచి మద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వాలు ఎంతమాత్రం సముఖత వ్యక్తం చేయవు అన్నది వాస్తవం. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర అబ్కారీ మంత్రి కవాసి లక్ష్మా ఎలాంటి మొహమాటం లేకుండా కడుపులో ఉన్న విషయాన్ని కక్కి పడేశారు.
Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు. పైగా దీనికి సంబంధించి ఆయన దగ్గర ఒక థియరీ కూడా ఉంది. మద్యం కొద్దిగా తీసుకునే హానికరమేం కాదట. ఎక్కువ తీసుకుంటేనే సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మద్యాన్ని ఆరోగ్య మందులతో కూడా లింక్ పెట్టి, ఏది ఎక్కువ తీసుకున్నా చనిపోతారంటూ చిత్రమైన లాజిక్ చెప్పడం గమనార్హం.
ఇక శ్రమజీవులు రోజూ ఎంతో పని చేసి శారీరకంగా అలసిపోతారు. వారికి ఊరట లభించాలంటే పొద్దు పోయాక కాస్త కడుపులో వేసుకోవాలని అన్నారు. అంతే కాకుండా, రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతాల్లో దేవుళ్ల ముందు దీన్ని హార (నైవేధ్యం లాంటిది) లాగ పోస్తుంటారట. విదేశాల్లో 100 శాతం మంది మద్యం తాగుతారట, తమ ప్రాంతంలో 90 శాతం మద్యం తాగుతారని.. అక్కడలేని పట్టింపులు ఇక్కడ ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను వ్యవసాయం చేశానని, తన ప్రజలతో కలిసి ఎన్నో పనులు చేశానని, శారీరకంగా అసలిపోయిన వారు తప్పక మద్యం తీసుకుంటారని, మద్య నిషేధం చేయాలన్న వారికి శారీరక శ్రమ తెలియదని విమర్శించారు.
#WATCH | Chhattisgarh Excise Minister Kawasi Lakhma says, “There will be no liquor ban in Bastar as long as I am alive”.
(09.04) pic.twitter.com/6zoFdwDiVU— ANI (@ANI) April 10, 2023
వాస్తవానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పాల్సిన మంత్రి ఇలా చెప్తుండడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక విపక్షాలకైతే అంతకు మించి ఆగ్రహాన్ని సైతం తెప్పిస్తోంది. అయితే ఈ మంత్రిని కనుక మిగిలిన నాయకులు ఆదర్శంగా తీసుకుంటే దేశ పరిస్థితి ఏంటని కొందరు విమర్శలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.