NTR30: ఎన్టీఆర్ కోసం మరో బ్యూటీ దిగుతుందా.. క్లారిటీ ఇవ్వని కొరటాల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల అఫీషియల్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ కథగా దర్శకుడు కొరటాల తీర్చిదిద్దనున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోండగా, ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల అఫీషియల్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ కథగా దర్శకుడు కొరటాల తీర్చిదిద్దనున్నాడు. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు కొరటాల చెప్పుకొచ్చాడు.
NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్
ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాగా, ఆమె పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండబోతుందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మరో బ్యూటీ కూడా హీరోయిన్గా నటించనుందట. ఆమె ఎవరనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.
NTR30: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందా.. అందుకేనా?
కొరటాల గత సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ పాత్రలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ, ఎన్టీఆర్ కోసం సెకండ్ హీరోయిన్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడట. మరి తారక్ సరసన సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసే ఆ బ్యూటీ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.