Odisha: ఒడిశాలోని ఝాజ్ పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. ఆరుగురి మృతి

ఈదురుగాలికి బోగీలు ముందుకు కదలడంతో ఆరుగురు మృతి చెందారు.

Odisha: ఒడిశాలోని ఝాజ్ పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. ఆరుగురి మృతి

Odisha Train Accident

Updated On : June 7, 2023 / 8:52 PM IST

Odisha – Goods train: ఒడిశాలోని బాలాసోర్ (Balasore) లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందిన ఘటన మరవకముందే ఝాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ (Jajpur Road station) లో మరో ప్రమాదం జరిగింది. గూడ్సు రైలుకు చెందిన నిరుపయోగ బోగీ కిందపడి ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇంజన్ లేని గూడ్సు రైలు రైల్వే స్టేషన్లో కొంత కాలంగా ఉంటుంది. కూలీలు రైల్వే మరమ్మతులు చేస్తోన్న సమయంలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో కూలీలు వెంటనే గూడ్సు బోగీ కిందకు వెళ్లారు. ఈదురుగాలికి బోగీలు ముందుకు కదలడంతో ఆరుగురు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. వర్షం కారణంగా సహాయక చర్యలకు మొదట ఆటంకం కలిగింది. మరోవైపు, బాలాసోర్ రైలు ప్రమాద క్షతగాత్రులకూ చికిత్స అందుతోంది. వారిలో కొందరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

Bhubaneswar : ఒడిశా రైల్వే ట్రాక్‌పై ప్రేమ లేఖలు, బొమ్మలు .. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు