Omicron Variant : కేరళలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 4 కేసులు..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేరళలోనూ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా..

Omicron Variant : కేరళలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 4 కేసులు..

Omicron Cases In Country

Updated On : December 15, 2021 / 10:50 PM IST

Omicron Variant : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 32కి పెరిగింది.

Cancer : క్యాన్సర్ దరిచేరకుండా కాపాడే ఆహారాలు ఇవే..

మరోవైపు కేరళలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా 4 కేసులు నమోదయ్యాయి. గతంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు కాగా, తాజాగా కేసులతో మొత్తం 5మందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 68కి పెరిగింది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లతో పాటు వేసుకున్న వాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Whole Grain Diet : చిరుధాన్యపు ఆహారంతో బరువు తగ్గొచ్చు తెలుసా?..

తొలి కేసు కొచ్చిలో వెలుగుచూసింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన నాలుగు కేసుల్లో ఇద్దరు బాధితుడి తల్లి, భార్య ఉన్నారు. మరో వ్యక్తి కాంగో నుంచి కొచ్చి వచ్చాడు. మరో మహిళ యూకే నుంచి తిరువనంతపురం ఎయిర్ పోర్టుకి వచ్చింది. పాతికేళ్ల ఆ మహిళ ఒమిక్రాన్ బారిన పడింది.