Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్స్.. ఇకపై ఏపీలోనే షూటింగ్స్ చేస్తామంటున్న నిర్మాతలు..
పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ యాగంలో పాల్గొని, జనసేన పార్టీ ఆఫీస్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
Pawan Kalyan Movie Shootings : పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ పక్క ఏపీ(AP)లో ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతుండటంతో పొలిటికల్ పనులు చూసుకుంటూనే మధ్యలో షూటింగ్స్ కి డేట్స్ ఇస్తున్నారు. అయితే ఏపీలో పొలిటికల్, మళ్ళీ హైదరాబాద్(Hyderabad) కి వచ్చి షూట్స్.. ఇలా టైం, మనీ ఎక్కువే ఖర్చు అవుతున్నాయి. దీంతో ఇకపై ఏపీలోనే షూట్స్ చేయాలని, పవన్ ఎక్కడుంటే అక్కడే షూట్స్ జరిగేలా, అక్కడే సెట్స్ వేసేలా నిర్మాతలు, డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు.
నిన్న సోమవారం జనసేన(Janasena) మంగళగిరి(Mangalagiri) పార్టీ ఆఫీస్ లో చండి యాగం నిర్వహించారు పవన్ కళ్యాణ్. అనంతరం కార్యకర్తలు, నాయకులతో మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ యాగానికి పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా విచ్చేశారు. యాగంలో పాల్గొని, జనసేన పార్టీ ఆఫీస్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను, నిర్మాతలు మొదటిసారి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి వచ్చాము. చాలా బాగుంది పార్టీ ఆఫీస్. ఆయన వారాహి యాత్రకు అభినందనలు. విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. పవన్ గారు ఇకపై ఎక్కువగా ఏపీలోనే ఉండబోతున్నారు కాబట్టి ఆయన షూటింగ్స్ కూడా ఇక్కడే జరగొచ్చు. ఆయనవే కావు వేరే సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగేలా చూస్తాము. ఇకపై ఆంధ్రాలో కూడా షూటింగ్స్ ఎక్కువగా జరపాలని నిర్ణయించుకున్నాం. త్వరలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరగనున్నాయి అన్ని అన్నారు.
Sai Dharam Tej : నా టాంగో ఇకపై లేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్..
ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. పవన్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్స్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ పుష్ప రాజమండ్రి, మారేడుమిల్లిలో చేశాము. పుష్ప 2 వైజాగ్ లో చేశాము. వీరసింహారెడ్డి కర్నూల్ లో చేశాము. ఇలా గతంలో ఏపీలో అనేక సినిమాలు షూట్ జరిగాయి. పవన్ గారు ఇకపై ఇక్కడే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడే షూట్స్ చేయబోతున్నాము. సెట్స్ అక్కడ వేసినా ఇక్కడ వేసినా ఒకటే. అందుకే సెట్స్ లో చేసేవి, ఇక్కడ లొకేషన్స్ లో చేసేవి ఇకపై ఏపీలోనే షూట్స్ కి ప్లాన్ చేస్తాము అని తెలిపారు. దీంతో ఇకపై పవన్ ఎక్కువగా ఏపీలోనే ఉండబోతున్నట్టు, షూటింగ్స్ అన్ని కూడా ఆయనకు దగ్గరగా ఉండే లొకేషన్స్ లోనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.