PM Kisan Samman Nidhi: అన్నదాతకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ ..

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఖాతాల్లోకి విడుదల చేశారు.

PM Kisan Samman Nidhi: అన్నదాతకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ ..

PM Kisan Samman Nidhi

Updated On : July 27, 2023 / 1:48 PM IST

PM KISAN: దేశంలోని కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. గురువారం రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రైతులకు ప్రయోజనకరమైన పథకం కింద ప్రధాని మోదీ నిధులు విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.2వేలు చొప్పున నేరుగా రూ. 17వేల కోట్లకుపైగా జమ చేశారు.

PM Kisan Samman Nidhi : రైతులకు శుభవార్త…రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతీయేటా మూడుసార్లు రూ.2వేలు మొత్తం రూ.6వేలు పొందుతున్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ – జులై నెలల మధ్యలో, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి నెలలు మూడు వాయిదాల్లో డబ్బులు అర్హులైన రైతులకు ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం అందించే నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమఅవుతున్నాయి. తాజాగా 14వ విడత పీఎం – కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశంలోని రైతుల సమస్యల పరిష్కారానికి నేడు 1.25 లక్షల కిసాన్ సమృద్ధి కేంద్రాలను అంకితం చేస్తున్నామని చెప్పారు. వీటి ద్వారా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం, ప్రతి పథకం గురించిన సమాచారం, దాని ప్రయోజనాలు తదితరాలను తెలియజేయటం జరుగుతుందని చెప్పారు.

PM Kisan Samman Nidhi : రైతులకు ఆర్థిక సహాయం పెంచనున్నకేంద్రం .. ఎంతంటే..

అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని కోట్లాది మంది రైతులకు సుమారు  17వేల కోట్లు ఇవ్వడం జరుగుతుందని, నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ అవుతుందని మోదీ అన్నారు.

పీఎంకిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

– తొలుత pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
– హోం పేజీలోని ఫార్మర్ కార్నర్ (Farmers Corner) సెక్షన్ పై క్లిక్ చేయాలి.
– ఆ తరువాత అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి.
– రైతు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. Get Data పై క్లిక్ చేయాలి.
– దీనిపై క్లిక్ చేయగానే పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.