PM Modi Speech: వచ్చే ఆగస్టు 15న నేను మళ్లీ వస్తా.. 2047 కల సాకారానికి వచ్చే ఐదేళ్లు సువర్ణ క్షణాలు..

2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

PM Modi Speech: వచ్చే ఆగస్టు 15న నేను మళ్లీ వస్తా.. 2047 కల సాకారానికి వచ్చే ఐదేళ్లు సువర్ణ క్షణాలు..

PM Narendra Modi

Updated On : August 15, 2023 / 10:00 AM IST

PM Narendra Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రముఖంగా మోదీప్రస్తావించారు. దాదాపు గంటన్నర పాటు ప్రధాని ప్రసంగం సాగింది. అవినీతి అభివృద్ధికి పెద్ద శత్రువు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ప్రధాని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు అనే మూడు చెడులపై పోరాడాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి మన దేశ ప్రజల ఆకాంక్షలపై ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు.

Independence Day 2023: నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం.. మణిపుర్ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ

అమృత్ కాల్ చక్రం నడుస్తోంది. ప్రతిఒక్కరి కలలు, అన్ని కలలు వర్ధిల్లుతున్నాయి. మన యువత అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. సరైన మార్గం, సరైన విధానం ఎంచుకొని సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లాలి. ప్రపంచంలో దేశం పేరును పెంచండి అని మోదీ దేశ యువతకు విజ్ఞప్తి చేశారు. 2014లో నేను మార్పు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. దేశ ప్రజలు నన్ను విశ్వసించారు. నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మకంగా మార్చుకున్నాను అని ప్రధాని అన్నారు. 2019లో పనితీరు ఆధారంగా మీరు నన్ను మళ్లీ ఆశీర్వదించారు. మార్పు నాకు మరో అవకాశం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు.

Independence Day 2023: ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ముఖ్యమైన అంశాలు ఇవే..

మీ కలలన్నీ నెరవేరుస్తాను. 2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని మోదీ చెప్పారు. అయితే, మోదీ తన ప్రసంగంలో ముగింపు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికలను ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశ విజయాలు, అభివృద్ధిని మీ ముందుంచుతానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మీ ఆశీర్వాదాలతో  నేను శంకుస్థాపన చేస్తున్న పథకాలను కూడా ప్రారంభిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.