prashant kishor : హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్

హస్తానికి కు హ్యాండ్ ఇచ్చారు పీకే..దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు. మళ్లీ తమ తమ రాజకీయాల్లో బిజి బిజీ అయిపోయారు.

prashant kishor  : హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్

Telangana Congress : హమ్మయ్య.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ చేరట్లేదు. ఇక.. అంతా ప్రశాంతం. ఇది.. నా ఫీలింగ్ కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫీలింగ్. ఎక్కడ.. ఆ పీకే వచ్చి.. కాంగ్రెస్ జెండా ఎత్తుకుంటాడోనని.. తెగ టెన్షన్ పడిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరిపోయి.. తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తే.. వచ్చే ఎన్నికల్లో తమ పనైపోతుందనుకున్నారు. కానీ.. పీకే హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో.. గాంధీభవన్ లోపల తీన్మార్ బ్యాండ్ మోగింది. లీడర్స్ అంతా గట్టిగా ఊపిరి పీల్చుకొని.. మళ్లీ పాలిటిక్స్‌ మీద కాన్సట్రేట్ చేస్తున్నారు.

Also read : Andhra Pradesh : జగన్ తరువాత నెంబర్ 2 అతనేనా? వైసీపీలో కీలక మార్పులు..

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్.. తెలంగాణ కాంగ్రెస్‌ని తెగ కుదిపేసింది. మిగతా రాష్ట్రాల్లోని పీసీసీల సంగతి పక్కనబెడితే.. పీకే పార్టీలోకి రావడం టీకాంగ్ నేతలకు అస్సలు ఇష్టం లేదు. అందువల్ల.. మొదటి నుంచి నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ.. ఇంతలోనే ఢిల్లీలో వేగంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్, సోనియాతో.. ప్రశాంత్ కిశోర్ వరుస భేటీలు, తర్వాత కేసీఆర్‌తో మీటింగుల్లాంటివన్నీ.. స్టేట్ కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరిచేశాయ్. సోనియాతో సమావేశమై వచ్చి.. కేసీఆర్ పీకే చర్చలు జరపడంతో.. రాష్ట్ర ప్రజల్లోకి కొత్త పొలిటికల్ సిగ్నల్స్ వెళ్లాయ్. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురుస్తుందని.. రెండు పార్టీలను కలిపేందుకే పీకే చర్చలు జరిపారని.. పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు పబ్లిక్‌లోనూ జోరుగా ప్రచారం సాగింది. దీంతో.. టీకాంగ్రెస్‌ బీపీ డౌన్ అయిపోయింది.

టీఆర్ఎస్‌తో పొత్తును కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే టైంలో.. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయ్. పీకే కాంగ్రెస్‌లో చేరతాడని.. టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే కేసీఆర్‌తో చర్చలు జరిపాడని.. తాను, ప్రశాంత్ కిశోర్ కలిసి.. త్వరలోనే ప్రెస్ మీట్ కూడా పెడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో.. టీఆర్ఎస్‌తో పొత్తు పొడవదన్నారు. కానీ.. సీన్ రివర్స్ అయింది. పీకే.. కాంగ్రెస్‌ ఆఫర్‌ని తిరస్కరించానని.. ఆ పార్టీలో చేరడం లేదని చెప్పేశారు. అప్పటిదాకా.. పీకే కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని కవర్ చేయలేక.. కిందా మీదా పడిన కాంగ్రెస్ నేతలు.. అతని నిర్ణం తెలిశాక.. ఎవరికి వాళ్లు ఎగిరి గంతేశారనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయ్.

Also read : Telangana : బీజేపీని తిట్టటానికే టీఆర్ఎస్ ప్లీనరీ.. : బండి సంజయ్

పీకే కాంగ్రెస్‌లోకి రాకపోతే.. టీఆర్ఎస్‌తో పొత్తు కథ ముగిసినట్లేనని.. ఫుల్ ఖుషీ అయిపోయారని.. లోలోపల కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు.. ఈ ఎపిసోడ్‌తో కేడర్‌కు కూడా స్పష్టమైన మెసేజ్ వెళ్లిందని.. ఇకపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బలంగా పోరాడే అవకాశం దక్కిందని.. కాస్త రిలాక్స్‌గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. తామంతా కోరుకున్నట్లే.. పీకే కాంగ్రెస్ చేరలేదని.. రాష్ట్ర నాయకత్వంతో పాటు సీనియర్లంతా.. తెగ ఖుషీ అయిపోతున్నారని.. గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.