Eggs : నాటుకోళ్ల గుడ్ల ఉత్పత్తిలో జాగ్రత్తలు

నాటుకోళ్ళు గుడ్లు పెట్టడానికి అనువైన ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలి. నాటు కోళ్లు పెంచుతున్న సమయంలో 8 పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేలా చూసుకోవాలి. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.

Eggs : నాటుకోళ్ల గుడ్ల ఉత్పత్తిలో జాగ్రత్తలు

Eggs (1)

Eggs : కోడి గుడ్డు పోషకాహారం. ఇందులో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యుల నిపుణులు సైతం కోడిగుడ్లు తింటే మంచిదని సూచిస్తున్నారు. గుడ్లలో ప్రధానంగా నాటుకోడి గుడ్లకు మార్కెట్లో ఎంతో డిమాండ్​ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో రైతులు, నిరుద్యోగ యువత నాటుకోళ్ల పెంపకం వైపు దృష్టి చూపుతున్నారు. ఇంటి వద్దే చిన్నచిన్న షెడ్లు నిర్మించుకుని నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారు. కోళ్లను విక్రయించటంతో పాటు, ముఖ్యంగా కోడి గుడ్ల ద్వారా అదాయం పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాటు కోడి గుడ్లకు మంచి గిరాకీ, ధర లభిస్తుంది.

ప్రస్తుతం ఒక్కో నాటుకోడి గుడ్డు ధర 10 నుంచి 15 రూపాయల వరకు పలుకుతుంది. కిలో నాటుకోడి మాంసం రూ.500 వరకు ఉంది. ఇక పండుగ సమయాల్లో నాటుకోళ్లకు ఎక్కవ ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. నాటుకోళ్లలో ఇమ్యునిటీ అధికంగా ఉంటుంది. వీటికి వ్యాధుల సంక్రమణ తక్కువేనని చెప్పాలి. వీటి పెంపకం ద్వారా గుడ్లను అధికంగా ఉత్పత్తి చేయాలంటే కొన్ని మెలకువలు పాటించటం మేలు. వీటిని షెడ్లలో ఉంచి పెంచకుండా ఆరుబయట తిరిగేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎక్కవగా, నాణ్యమైన గుడ్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

నాటుకోళ్ళు గుడ్లు పెట్టడానికి అనువైన ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలి. నాటు కోళ్లు పెంచుతున్న సమయంలో 8 పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేలా చూసుకోవాలి. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. గుడ్ల ఉత్పత్తిని పెంచుకోవాలి అనుకుంటే శాస్త్రీయ పద్ధతుల్లో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కోడి గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్లీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంది.

నాటుకోళ్ళు కొన్నిసార్లు తోలు గుడ్లను పెడుతుంటాయి ఇలాంటి వాటిని నివారించడానికి. కోడి పెట్టలు గుడ్లు పెట్టే సమయంలో ప్రతిరోజు ఒక్కొక్క పెట్టకు 3 గ్రాముల పాడిస్తున్నం గాని, పొడి చేసిన కోడి గ్రుడ్డు పెంకును గాని, మార్కెట్లో దొరికే కాల్ సేమ్ లవణాలను అందించినట్లయితే తోలు గుడ్డు పెట్టడాన్ని నివారించవచ్చు. నాటుకోళ్ళ పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తే పెంపకం దారులకు లాభదాయకంగా ఉంటుంది.