Narendra Modi : ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, ఎలా పని చేస్తుంది ?

డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది.

Narendra Modi : ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, ఎలా పని చేస్తుంది ?

Pm Modi

Ayushman Bharat Digital Mission : ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయించనుంది కేంద్రం. అతని ఆరోగ్య సమాచారం అంతా..డిజిటల్ రూపంలో భద్రం చేయనున్నారు. ఆధార్ తరహాలో…హెల్త్ ఐడీ సంఖ్యను కేటాయించే విధంగా కేంద్రం సన్నాహాలు చేసింది. హెల్త్ ఐడీలో ఆరోగ్య రికార్డులు నమోదు కానున్నాయ. వైద్యుడి దగ్గరకు వెళ్లినా..ఫార్మసికి వెళ్లినా…ప్రతిసారి జాతీయస్థాయిలో హెల్త్ ఐడీలో సమాచారం మొత్త నిక్షిప్తం కానుంది. దీని ఆధారంగా..అతని ఆరోగ్య సమాచారాన్ని వైద్యులు పరిశీలించే వీలుంది. సెప్టెంబర్ 27వ తేదీన డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది.

Read More : Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్

ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లినా..ట్రీట్ మెంట్ రికార్డులు పొగొట్టుకున్నా..సరే..సంబంధిత సమాచారం. ఈ వెబ్ సైట్ లో భద్రంగా ఉంటుంది. కేవలం ఆసుపత్రికి వెళ్లి ఐడీ ఒక్కటి చెబితే చాలు. వారికి సంబంధించిన ఆరోగ్య సమాచారం..తదితర వివరాలు డిస్ ప్లే అవుతాయి. డైరెక్ట్ గా సంబంధిత ఆసుపత్రి సిబ్బంది సదరు వ్యక్తి హెల్త్ ఇన్ఫర్ మేషన్ ను డిజిటిల్ రూపంలో చూసే వీలుంటుంది. కొత్తగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి వస్తే..మాత్రం..ఆ వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ లో భాగంగా..ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు, అండమాన్ & నికోబార్, చండీగఢ్ దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డామన్ డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు.

Read More : India COVID 19 : గుడ్ న్యూస్! తగ్గుతున్న కేసులు.. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది

డిజిటల్ హెల్త్ మిషన్ తో టెక్నాలజీ ఆధారంగా..దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు వైద్యులు సూచించిన మందులు, గతంలో ఏం చికిత్స తీసుకున్నారన్న సమాచారం. సదరు వ్యక్తికి అందే ఆరోగ్య పథకాలు, బీమా వివరాలు అన్నీ కల్పించనున్నారు. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకత మెరుగుపడనుంది. మారుమూల ప్రాంతాలకు టెలీ మెడిసిన్, ఈ ఫార్మసీల సేవలు, ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

Read More : Old Age Mother : ప్రియురాలితో కలిసి తల్లిని ఇంట్లోంచి గెంటేసిన తనయుడు

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ABPM-JAY) పరిధిలోకి డిజిటల్ హెల్త్ మిషన్ రానుంది. ఇందులో ఎలాంటి సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. 2020, ఆగస్టు 15వ తేదీన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పేరిట…ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నే పీఎం-డీహెచ్ఎం (PM-DHM) గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేనుంది కేంద్రం.