RGV: ‘డేంజరస్’గా మారిన నట్టి కుమార్.. కోర్టులోనే తేల్చుకుంటానంటోన్న వర్మ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం’) ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని గతంలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది..

RGV: ‘డేంజరస్’గా మారిన నట్టి కుమార్.. కోర్టులోనే తేల్చుకుంటానంటోన్న వర్మ!

Producer Natti Kumar Brings Court Stay On Rgv Dangerous Movie For Second Time

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం’) ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని గతంలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా లెస్బియన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో వస్తుండటంతో ఈ సినిమాపై ఘాటు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని చూసిన వర్మకు థియేటర్ల యాజమాన్యాలు షాకిచ్చాయి. డేంజరస్ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని.. ముఖ్యంగా ఈ సినిమా థీమ్‌ను తమ థియేటర్లలో ప్రదర్శించి ప్రేక్షకులను దూరం చేసుకోలేమని పలు సినిమా థియేటర్ల యాజమాన్యాలు వర్మకు కౌంటర్ ఇచ్చాయి. దీంతో ఈ వివాదంపై కోర్టులో తేల్చుకుంటానని వర్మ గతంలో చెప్పుకొచ్చాడు.

RGV : నా డేంజరస్ సినిమాని కుట్ర పన్ని ఆపారు

ఇక చాలా సంప్రదింపుల తరువాత ఈ సినిమాను మే 6న నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అయ్యాడు. అందరూ మెచ్చే విధంగా ‘మా ఇష్టం’ సినిమా ఉంటుందని ఆయన ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు. అయితే వర్మకు బ్యాడ్ టైమ్ ఇంకా పోనట్లుగా కనిపిస్తుంది. మా ఇష్టం సినిమా రిలీజ్‌ను ఆపేయాలంటే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కోర్టు స్టే తీసుకొచ్చారు. నట్టి కుమార్‌కి వర్మ డబ్బు బాకీ ఉన్నాడని.. అది పూర్తిగా చెల్లించే వరకు మా ఇష్టం సినిమాను థియేటర్లలో గాని, ఓటీటీలో గాని రిలీజ్ చేయొద్దంటూ సిటీ సివిల్ కోర్టు నుండి నట్టి కుమార్ స్టే తీసుకొచ్చారు. దీంతో వర్మకు మరోసారి నట్టి షాకిచ్చారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

RGV : లేడీ సర్కార్ అంటూ.. విశ్వక్ సేన్, యాంకర్ గొడవపై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

అయితే గతంలోనూ వర్మ ‘మా ఇష్టం’ చిత్రం రిలీజ్ సమయంలో నట్టి కుమార్ రిలీజ్ నిలిపివేయాలనే కోర్టు స్టే తెచ్చిన సంగతి తలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన స్టే తీసుకురావడంతో నట్టికుమార్ సంగతి కోర్టులోనే తేల్చుకుంటానని వర్మ అంటున్నారు. మరి వర్మ తెరకెక్కించిన ‘మా ఇష్టం’ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలీ లీడ్ రోల్స్ పోషించారు.