CM Bhagwant Mann: వీడియో తీసి నాకు పంపించండి.. అవినీతి అంతుతేలుద్దాం – పంజాబ్ సీఎం

పంజాబ్ గవర్నమెంట్ లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలించే దిశగా కృషి చేయనుంది. ఈ మేరకు మార్చి 23న హెల్ప్ లైన్ ఆరంభించనుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం భగవంత్ మన్...

CM Bhagwant Mann: వీడియో తీసి నాకు పంపించండి.. అవినీతి అంతుతేలుద్దాం – పంజాబ్ సీఎం

Punjab Cm

CM Bhagwant Mann: పంజాబ్ గవర్నమెంట్ లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలించే దిశగా కృషి చేయనుంది. ఈ మేరకు మార్చి 23న హెల్ప్ లైన్ ఆరంభించనుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం భగవంత్ మన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఈ కార్యక్రమం గురించి వెల్లడించారు పంజాబ్ రాష్ట్ర 17వ సీఎం.

‘భగత్ సింగ్ అమరుడైన మార్చి 23వ తేదీనే యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేస్తామని.. అది కూడా నా పర్సనల్ వాట్సప్ నెంబరేనని’ సీఎం స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘మీ నుంచి ఎవరైనా లంచం తీసుకోవాలని చూసినా.. ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డ్ చేసి ఆ క్లిప్ నాకు పంపించండి. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. పంజాబ్ లో కరప్షన్ మనుగడకు కాలం చెల్లింది’ అంటూ పోస్టు పెట్టారు.

Read Also: ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన భగవంత్ మన్

ప్రజలు తనను ఎంచుకున్నందుకు వారు కోరుకునే మార్పును తప్పకుండా తీసుకొస్తానని ఆప్ ఎమ్మల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే భగవంత్ అన్నారు. మా ప్రభుత్వం పంజాబ్ లోనే అత్యంత నిజాయతీతో కూడిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘వ్యవస్థలో ఉన్న 99శాతం మంది నిజాయతీగానే ఉంటారు. కేవలం ఆ మిగిలిన 1శాతం వల్లనే వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. నేనెప్పుడూ నిజాయతీ గల ఆఫీసర్లతో పాటే ఉంటాను. పంజాబ్ లో దోపిడీలు ఇకపై ఉండవు. హప్తా వసూలీ కింద ఏ మంత్రి సమస్యకు గురి చేయరు’ అని పంజాబ్ సీఎం చెప్పారు.