Pushpa 2: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన....

Pushpa 2: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2

Pushpa 2 Becomes Hot Topic Once Again

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఊరమాస్ అవతారంలో బన్నీ తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అన్ని భాషల్లోనూ పుష్ప అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ను చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. అయితే ప్రస్తుతం కేజీయఫ్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి పుష్ప-2 సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

కేజీయఫ్ 2 సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఇంతటి రెస్సాన్స్ రావడం కోసం చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్స్ నిర్వహించింది. కానీ ‘పుష్ప’ సినిమా తొలి భాగం నార్త్‌లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే బరిలోకి దిగింది. పలు ఆంక్షల మధ్య, 50 శాతం అక్యుపెన్సీతోనే పుష్ప బాలీవుడ్‌లో ఆ రేంజ్ సక్సెస్ అందుకుందంటే.. ఇప్పుడు అన్ని అనుమతులు ఉండటంతో పుష్ప 2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?

దీంతో పుష్ప-2 చిత్రం రిలీజ్‌కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించి, ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక నార్త్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న బన్నీకి కెరీర్ బెస్ట్ మూవీగా పుష్ప-2 సినిమా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో గనక పుష్ప తొలి పార్ట్ రిలీజ్ అయ్యి ఉంటే, ఎలాంటి విజయం సాధించేది.. దీన్నిబట్టి పుష్ప-2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.