R Krishnaiah : పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆర్ కృష్ణయ్య

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని వాపోయారు.

R Krishnaiah : పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆర్ కృష్ణయ్య

R.krishnaiah

BC Mahadharna in Delhi : దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో బీసీలు మహాధర్నా నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీసీలకు న్యాయం చేయాలంటూ పార్లమెంటు ముట్టడికి యత్నించారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో బీసీల జనాభాని లెక్కించాలన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని వాపోయారు. బీసీ నాయకులు, బీసీ ఎంపీలతో కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Telangana Special Scheme : తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక పథకం!

దేశవ్యాప్తంగా 55 శాతంపైగా బీసీ జనాభా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు బిచ్చం వేసినట్లు 1400 కోట్ల రూపాయలు కేటాయించారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే తప్ప బీసీల తలరాతలు మారవు అని అన్నారు. మిలిటెంట్ ఉద్యమం తరహాలో కార్యచరణ చేపడతామని పేర్కొన్నారు.