Rahul Gandhi: ట్విట్టర్లో 50 మందిని అన్‌ఫాలో చేసిన రాహుల్.. అసలేమైంది?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా రాహుల్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తుంటారు.

Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా రాహుల్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తుంటారు. ప్రధానంగా సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రాహుల్ ఒకవిధంగా ట్విట్టర్ వేదికగా రాజకీయాలు కూడా నడిపిస్తుంటారు. అయితే.. రాహుల్ ట్విట్టర్ ద్వారా తాజాగా ఒక్కసారిగా 50 మంది ట్విట్టర్ ఖాతాలను అనుసరించడం మానేశారు. ఇందులో ఆయనకు బాగా సన్నిహితులు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యలు కూడా ఉన్నారు.
అంత దగ్గరివారిని కూడా రాహుల్ గాంధీ అన్ ఫాలో చేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర రాజకీయ వర్గాలలో రాహుల్ ట్విట్టర్ కహానీనే ఆసక్తిగా మారింది. ఆయన ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు కానీ దీనిపై రకరకాల కారణాల అన్వేషణ కూడా జరుగుతుంది. దాదాపు 50 ఖాతాలను ఒకేసారి అన్ ఫాలో చేసినట్లు తెలుస్తుండగా ఈ వార్త ప్రస్తుతం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీ అన్‌ఫాలో చేసిన అకౌంట్లలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, తరుణ్ గొగొయి ఖాతాలూ ఉన్నాయి. రాహుల్‌కు ట్విట్టర్లో కోటీ 80 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉండగా ప్రస్తుతం 220 మందిని ఆయన అనుసరిస్తున్నారు. ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులే ఉండగా అతికొద్ది మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన అన్‌ఫాలో చేసిన వారిలో జర్నలిస్టులు కూడా ఉండడం విశేషం.