MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే విలువ పోయింది. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వం.(MLA Jagga Reddy)

MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

MLA Jagga Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు అంశం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాహుల్ పై అనర్హత వేటును ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. వేటు అప్రజాస్వామికం అని మండిపడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ టార్గెట్ గా విపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. గాంధీ కుటుంబంపై మోడీ ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ అనర్హత ఓ ఉదాహరణ అన్నారు. పార్లమెంటులో ఉండొద్దనే కుట్రతోనే రాహుల్ పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని గంటల వ్యవధిలో పార్లమెంటులో రాహుల్ ఉండకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. ఇంతకంటే నీచం మరొకటి లేదన్నారు.

Also Read..CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

రాహుల్ గాంధీకి ఎంపీ పదవి లేకపోయినా పెద్ద సమస్య కాదన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ఆయన మాటకు, ఆ కుటుంబానికి విలువ ఉందన్నారు జగ్గారెడ్డి. అద్వానీ ప్రధాని కాకుండా కుట్రలతో మోడీ ప్రధాని అయ్యారని జగ్గారెడ్డి ఆరోపించారు. అలాంటి మోడీకి, రాహుల్ కుటుంబానికి చాలా తేడా ఉందన్నారు.(MLA Jagga Reddy)

”ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదిలేసి మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసిన కుటుంబం రాహుల్ ది. రాహుల్ గాంధీ పాదయాత్ర చూసి బీజేపీ మైండ్ బ్లాక్ అయింది. గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే విలువ పోయింది. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వం. రాహుల్ ను ఎందుకు సస్పెండ్ చేశామా? అని బీజేపీ ఇప్పుడు ఫీల్ అయ్యే ఉంటుంది. అదానీ స్కాంతో బీజేపీలో కొట్లాటలు జరుగుతున్నాయి. దాని మీద చర్చ జరగకుండా బీజేపీ చేసిన రాజకీయ కుట్రనే రాహుల్ పై చర్య. రాహుల్ కు మేమంతా అండగా నిలబడతాం” అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Also Read..Actor Shivaji : దూరం చేయాలనుకుంటే.. రాహుల్‌ను చంపేయండి- నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నాయి. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్‌ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు నేతలు. ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా ఆరోపిస్తున్నారు.(MLA Jagga Reddy)

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటిరోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాలపై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరముందన్నారు.

Also Read..KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

రాహుల్ గాంధీపై అనర్హత వేటు..
ప్రధాని నరేంద్రమోదీ ఇంటి పేరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ వెంటనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్‭సభకు అనర్హుడయ్యారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇప్పటికిప్పుడే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

2019 కర్నాటక ఎన్నికల సమయంలో మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన కేసును నాలుగేళ్లుగా విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ కు జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పీల్ కు వెళ్లడానికి 30 రోజుల గడువు విధించింది. అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కరోజు వ్యవధిలోనే లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. కోర్టు తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆయన లోక్ సభ సభ్యత్వం చెల్లుబాటు కాదని ప్రకటించడం సంచలనం రేపింది.