RRR: బంగాళాఖాతం హోరులా మెగా ఫ్యాన్స్.. అరేబియా ఘోషలా నందమూరి ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని..

RRR: బంగాళాఖాతం హోరులా మెగా ఫ్యాన్స్.. అరేబియా ఘోషలా నందమూరి ఫ్యాన్స్!

Rrr (4)

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా శనివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు కూడా హాజరవగా ఈ వేడుకకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

RRR: టికెట్ల ధర పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు దానయ్య కృతజ్ఞతలు

ఈ వేడుకలో మాట్లాడిన దర్శక ధీరుడు జక్కన్న ఓ సంగమం సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చాడు. ఈ వేడుకలో ఎన్నో సంగమాలు చూస్తున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ వేడుక సాక్షిగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్.. తెలుగు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్-రామ్ చరణ్ సంగం ఇక్కడే చూస్తున్నానని.. కన్నడ చిత్ర సీమ అభిమానులు-తెలుగు చిత్ర సీమ అభిమానుల సంగం ఇక్కడే జరుగుతుందని.. బంగాళాఖాతం హోరులా మెగా ఫ్యాన్స్ అరుపులు.. అరేబియా ఘోషలా నందమూరి ఫ్యాన్స్ అరుపుల సంగమం ఇక్కడే జరుగుతుందని మాట్లాడారు.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ టాపిక్‌గా మారిన జెండాలు!

అంతేకాదు.. ఈ వేడుక సాక్షిగా ఇన్ని సంగమం చూస్తుంటే.. శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుందని చెప్పారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తన దర్శకత్వంలో తనకు ఎంతో బలమైన తన అసిస్టెంట్ దర్శకుల గురించి కూడా రాజమౌళి తొలిసారి వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కోటి, శ్రీను, శ్రీరామ్, అనిల్, కిరణ్, ఆన్ లైన్ ఎడిటర్ నాగార్జున, డబ్బింగ్ పనులు చూసుకున్న రాహుల్, సురేష్, షెడ్యూల్స్ పనులు చూసిన సుధాకర్, సుబ్బు, ప్రొడక్షన్ చూసిన యోగానంద్ అంతా వెనుకుండి మమ్మల్ని నడిపిస్తేనే నేను ఇలా మీ ముందున్నానని చెప్పుకొచ్చారు.