RRR : ఆస్కార్‌కి ఎన్టీఆర్, చరణ్‌కి ఆహ్వానం వచ్చింది.. రాజమౌళి టికెట్ కొనుకొని వెళ్ళాడు.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

ఆస్కార్ (Oscar) వేడుకకు ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) టికెట్స్ కొనుకొని వెళ్లారు అంటూ వస్తున్న వార్తలు పై రాజమౌళి తనయుడు కార్తికేయ రెస్పాండ్ అయ్యాడు.

RRR : ఆస్కార్‌కి ఎన్టీఆర్, చరణ్‌కి ఆహ్వానం వచ్చింది.. రాజమౌళి టికెట్ కొనుకొని వెళ్ళాడు.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

Rajamouli son Karthikeya says ntr and ram charan had invitation for oscar

RRR : ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా హాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ అయితే భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. అంతేకాదు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ (Oscar) ని కూడా గెలుచుకొని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది.

RRR : ఆస్కార్ క్యాంపైన్ కోసం అంత ఖర్చు చేసాం.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

ఆస్కార్ అవార్డుని అందుకోవడమే కాదు, ఆ వేడుకల్లో పాల్గొనడం కూడా ఎంతో గౌరవంగా భావిస్తారు ప్రపంచంలోని సినీ తారలు అంతా. అలాంటి వేడుకల్లో రెడ్ కార్పెట్ పై మన టాలీవుడ్ స్టార్స్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సందడి చేయడంతో తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. అయితే ఇటీవల ఒక వార్త బయటకి వచ్చి వైరల్ అయ్యింది. అదేంటంటే ఆస్కార్ కి కేవలం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మాత్రమే ఆహ్వానం అందింది. మిగిలిన వారంతా డబ్బులు పెట్టి ఆస్కార్ వేడుక టికెట్ కొనుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ అయ్యింది.

M M Keeravani : RGV నా మొదటి ఆస్కార్ అంటున్న కీరవాణి.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటున్న వర్మ!

తాజాగా దీని పై రాజమౌళి కొడుకు కార్తికేయ స్పందించాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ ఆహ్వానం పంపింది. రాజమౌళి మరియు ఇతర కుటుంబ సభ్యులు టికెట్ కొనుకొని ఆస్కార్ కి వెళ్ళాం. కుటుంబసభ్యులు, ఇతర సాంకేతిక నిపుణులు ఆస్కార్ కి హాజరుకావాలి అనుకుంటే, నామినేషన్స్ లో ఉన్నవారు మిగిలిన వాళ్ళ టికెట్స్ కోసం అకాడమీకి ఇమెయిల్ చేయాలి.

అలా మా కోసం కీరవాణి, చంద్రబోస్ ఇమెయిల్ చేయగా, వాళ్ళు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నాం. టికెట్స్ ధర విషయంలో మీరు విన్న వార్తలు కూడా నిజం కాదు. టికెట్స్ లో కూడా రకాలు ఉంటాయి. మేము లోయర్ లెవెల్ సీట్స్ కోసం ఒకొక టికెట్ కి 750 డాలర్లకి, టాప్ లో కూర్చొని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురి కోసం ఒకొక టికెట్ కి 1500 డాలర్లు ఖర్చు చేసాం అని తెలియజేశాడు.