RRR: ఆర్ఆర్ఆర్‌లో పవన్ కళ్యాణ్.. నిజం!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే......

RRR: ఆర్ఆర్ఆర్‌లో పవన్ కళ్యాణ్.. నిజం!

Rajamouli Thought Of Pawan Kalyan Name To Rrr Hero

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్ల ముందు బారులు తీరారు.

RRR: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్!

ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించాలని చిత్ర యూనిట్ చాలా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో ఓ హీరోకు పవన్ కళ్యాణ్ పేరును పెట్టాలని రాజమౌళి భావించాడని, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదని ఆయన అన్నాడు.

RRR: RRR పోస్టులు అందుకే డిలీట్ చేశా – ఆలియా!

ఒకవేళ కథానుసారంగా, ప్రేక్షకుల ఇష్టం మేరకు సినిమాలోని పాత్రల పేర్లు పెట్టుకోగలిగితే, ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పవన్‌కు ఉన్న క్రేజ్‌ను తమ సినిమాలో క్యాష్ చేసుకునేందుకే ఆయన పేరును వాడుకోవాలని చిత్ర యూనిట్ భావించినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్‌కు పవన్ కళ్యాణ్ పేరు తోడయితే ఆ క్రేజ్ మరో లెవెల్‌కు ఖచ్చితంగా చేరేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.