RRR: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్!

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ.....

RRR: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్!

Rrr First Week Worldwide Collections

RRR: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక రివ్యూలు కూడా బాగా రావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వాలు అనుమతులివ్వడం లాంటి అనుకూల పరిస్థితులతో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేస్తోంది.

RRR: RRR పోస్టులు అందుకే డిలీట్ చేశా – ఆలియా!

తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ వరకు అదే జోరును కొనసాగించింది. ఇక అసలైన వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమా వసూళ్లు కాస్త నెమ్మదించాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.710 కోట్ల మేర గ్రాస్.. రూ.392 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. బాహుబలి 2 చిత్రం తరువాత ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ నిలిచింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించాడు.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కేమియో పాత్రలో నటించాడు. అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.77.22 కోట్లు
సీడెడ్ – రూ.37.28 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.20.97 కోట్లు
ఈస్ట్ – రూ.11.16 కోట్లు
వెస్ట్ – రూ.9.76 కోట్లు
గుంటూరు – రూ.14.03 కోట్లు
కృష్ణా – రూ.10.78 కోట్లు
నెల్లూరు – రూ.6.45 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.187.65 కోట్లు(షేర్) (రూ.279.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.27.75 కోట్లు
తమిళనాడు – రూ.25.30 కోట్లు
కేరళ – రూ.7.60 కోట్లు
హిందీ – రూ.65.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.5.10 కోట్లు
ఓవర్సీస్ – రూ.73.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.392.45 (షేర్) (రూ.710 కోట్లు గ్రాస్)