RRR: RRR పోస్టులు అందుకే డిలీట్ చేశా – ఆలియా!

ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, స్టార్ హీరోలు రామ్ చరణ్....

RRR: RRR పోస్టులు అందుకే డిలీట్ చేశా – ఆలియా!

Alia Bhatt Clarity On Rrr Posts Delete

RRR: ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే గతకొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆలియా భట్ అలిగిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆలియా భట్ రెస్పాండ్ అయ్యింది.

RRR: జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్?

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో సీత పాత్రలో నటించినందుకు తాను ఎప్పటికీ రాజమౌళి అండ్ టీమ్‌కు రుణపడి ఉంటానని ఆలియా పేర్కొంది. ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి పోస్టులు డిలీట్ చేశానని, చిత్ర యూనిట్‌తో తనకు మనస్పర్థలు వచ్చాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమే ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే తన సోషల్ మీడియా అకౌంట్‌లో పాత వీడియోలు, స్టఫ్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటానని, అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్ చేశానే తప్ప.. మరే ఇతర ఉద్దేశ్యంతో కాదని ఆలియా చెప్పుకొచ్చింది.

RRR లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని, ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తాను భాగమైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఇలాంటి ప్రాజెక్టును దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం తనకు బాగా నచ్చిందని, ఈ సినిమాలో తాను చేసిన సీత పాత్ర తనకు చాలా మంచి పేరును తీసుకొచ్చిందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. ఇక తారక్, చరణ్‌లు పడ్డ కష్టానికి వారికి తగిన స్టార్‌డమ్ ఈ సినిమాతో వస్తుందని ఆమె తెలిపింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాపై ఎలాంటి తప్పుడు వార్తలు రాకుండా ఉండేందుకే తాను ఈ క్లారిటీ ఇస్తున్నట్లు ఆలియా పేర్కొంది.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

మొత్తానికి ఆలియా భట్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పోస్టులు డిలీట్ చేయడంపై కొద్దిరోజులుగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో వినిపిస్తున్న వార్తలకు ఆమె ఈ పోస్ట్‌తో చెక్ పెట్టిందని చెప్పాలి.

Alia Bhatt Clarity