Rakul Preet Singh: త్వరలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది.

Rakul Preet Singh: త్వరలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

Rakul

Updated On : October 10, 2021 / 3:53 PM IST

Rakul Preet Singh: టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని తన పుట్టినరోజు(10 అక్టోబర్) నాడే ప్రకటించడం విశేషం. ప్రస్తుతం జాకీ భ‌గ్నానీతో రిలేష‌న్ షిప్‌లో ఉన్న రకుల్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

‘‘థాంక్యూ మై లవ్. ఈ ఏడాది నువ్వే నాకు అతి పెద్ద బ‌హుమానం. నా జీవితంలో రంగుల‌ను అద్దినందుకు ధన్యవాదాలు‌. నన్ను చాలా సంతోషంగా ఉంచుతున్నావ్. నా ల‌వ్‌గా ఉన్నందుకు థాంక్స్‌. మ‌నం ఇద్ద‌రం క‌లిసి మ‌రిన్ని జ్ఞాప‌కాల‌ను ఏర్ప‌రుచుకుందాం’’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఫోటోను షేర్ చేసుకుంది.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. సౌత్ సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం హిందీలో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. రకుల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తర్వాత అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)