Redmi Note 12 5G Launch : సరికొత్త వేరియంట్‌తో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. అమెజాన్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Redmi Note 12 5G Launch : రెడ్‌మి (Redmi) నుంచి మరో సరికొత్త వేరియంట్ రెడ్‌మి నోట్ 12 5G (Redmi Note 12 5G) వచ్చేసింది. ఏప్రిల్ 6 నుంచి అమెజాన్ సేల్ లో కొనుగోలు చేయొచ్చు. 

Redmi Note 12 5G Launch : సరికొత్త వేరియంట్‌తో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. అమెజాన్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

Redmi Note 12 5G’s new variant with more storage launched in India, Check price

Redmi Note 12 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి సరికొత్త వేరియంట్‌తో రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ (Redmi Note 12 5G) ఫోన్ లాంచ్ అయింది. ఏప్రిల్ 6 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale)లో సేల్ అందుబాటులో ఉండనుంది. షావొమీ ఇటీవలే రెడ్‌మి బ్రాండ్‌తో భారత మార్కెట్లో (Redmi Note 12), (Redmi 12C) అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.

ఈ రెండు కొత్త డివైజ్‌లతో పాటు, Redmi Note 12 5G స్మార్ట్‌ఫోన్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో కొత్త స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో (Xiaomi Redmi Note 5G) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 4GB/6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో అందిస్తుంది. ఈ డివైజ్ కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

అంతేకాకుండా, రెడ్‌మి యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో 1TB వరకు మైక్రో SD కార్డ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. రెడ్‌మి Note 12 5G ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 21,999 ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఏప్రిల్ 6 నుంచి (Amazon.in), mi.com నుంచి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. షావోమీ ఐసీఐసీఐ (Xiaomi ICICI) బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపు, రూ. 1,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో సహా కొన్ని అద్భుతమైన లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది.

Redmi Note 12 5G’s new variant with more storage launched in India, Check price

Redmi Note 12 5G’s new variant with more storage launched in India 

Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

డిజైన్ పరంగా చూస్తే.. రెడ్‌మి నోట్ 12 5G సిరీస్ ప్రామాణిక వెర్షన్ లైనప్ ప్రో మోడల్‌లను పోలి ఉంటుంది. ఇందులో పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. కానీ, ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ IP53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 12 5Gలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. Redmi Note 12 5G 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల Full-HD+ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 4500000:1, 4096-లెవల్ డిమ్మింగ్ కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.

DCI-P3 కలర్ అందిస్తుంది. Note 12 5Gని రన్ చేయడం అనేది Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్ అందిస్తోంది. 5G కనెక్టివిటీకి సపోర్టును అందిస్తుంది. చిప్‌సెట్ గరిష్టంగా 6GB LPDDR4X RAMతో, 128GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీ పెంచుకునే ఆప్షన్ కలిగి ఉంటుంది.

(Redmi Note 12 5G) Android 12-ఆధారిత MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 33W ఛార్జర్‌తో ఛార్జ్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా ఫీచర్లలో 48MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్‌లో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

Read Also : Koo Lifetime Free Verification : ట్విట్టర్‌లా డబ్బులు కట్టక్కర్లేదు.. Koo లైఫ్‌టైమ్ ఫ్రీ వెరిఫికేషన్ ఆఫర్.. వారికి మాత్రమేనట..!