TPCC : ప్రశాంత్ కిశోర్ చేరికపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, ఏ బాధ్యతలు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ లో చేరాక ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని, తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయే...

TPCC : ప్రశాంత్ కిశోర్ చేరికపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth

Revanth Reddy Comments on Prashant Kishor : సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తుగానే రాజకీయ వేడి పెరుగుతోంది. తెలంగాణలో కూడా పొలిటికల్‌ హీట్‌ రాజుకుంటోంది. ఇప్పటినుంచే పొత్తు పొడుపులు, కూటమి రాజకీయాలపై చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిశోర్…ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. సోనియా గాంధీతో వరుస సమావేశాలు పూర్తైనా పీకే కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరబోతున్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు.. పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమే..కానీ అంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు ధీర్ఘాలు తీస్తున్నారు.

Read More : Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌‌తో టీఆర్ఎస్ కటీఫ్ ?

తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కు వ్యూహకర్తలు అవసరం లేదని, పార్టీలో నాయకులు తప్ప వ్యూహకర్తలు ఉండరని కీలక వ్యాఖ్యలు చేశారు. 2022, ఏప్రిల్ 23వ తేదీ శనివారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, ఏ బాధ్యతలు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ లో చేరాక ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని, తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

Read More : Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?

పార్టీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ వైపు చూడడం, రాజకీయ వ్యూహకర్తగా కన్నా..కాంగ్రెస్ నేతగా కనిపించేందుకు పీకే ఆరాటపడడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాల్లో పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో ఆయన కూడా తెలంగాణకు సంబంధించి కీలక సూచన చేసినట్టు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ అంటే రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆ అభిమానాన్ని ఓట్లగా మలుచుకోవాలంటే…ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని పీకె పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నెల మొదటివారంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో కానీ, ఎంఐఎంతో కానీ పొత్తుపెట్టుకోదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు గమనిస్తే…టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా తలపడే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రశాంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరుక్షణం..ఆయనతో టీఆర్ఎస్‌ బంధానికి ఫుల్‌స్టాప్ పడుతుంది.