Revanth Reddy : నేనుంత వరకు అలా జరగనివ్వను- కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరికపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని ఆయన తేల్చి చెప్పారు.

Revanth Reddy
Revanth Reddy – YS Sharmila : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక వార్తలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఏపీ మనిషి అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికే అని ఆయన స్పష్టం చేశారు. అలాంటిది.. షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని ఆయన తేల్చి చెప్పారు. అదే సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ కి పని చేస్తే తప్పకుండా స్వాగతిస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు. షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్ గా ఆమెని కలుస్తానని వ్యాఖ్యానించారు.
మొత్తంగా.. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని రేవంత్ రెడ్డి చెప్పారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అన్నారు రేవంత్ రెడ్డి.