RGV : తెలంగాణ రాజకీయాల్లో ఆర్జీవీ చిచ్చు.. మరో బయోపిక్

ఒకప్పుడు సక్సెస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండి తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా..

RGV : తెలంగాణ రాజకీయాల్లో ఆర్జీవీ చిచ్చు.. మరో బయోపిక్

Rgv

RGV :  ఒకప్పుడు సక్సెస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండి తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించిన ప్రతీసారి ఏదో ఒక వివాదం చెలరేగుతుంది. ఇప్పటికే చాలా సినిమాలు ప్రకటించాడు. చాలా మంది జీవిత చరిత్రలు తీసాడు, తీస్తాను అంటాడు ఆర్జీవీ.

తాజాగా తెలంగాణ రాజకీయ నాయకుడు కొండా మురళి బయోపిక్ తీయబోతున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో తాను ఇప్పటి వరకు రాయలసీమ ఫ్యాక్షన్ పై , విజయవాడ రౌడీయిజంపై సినిమాలు తీశానని కానీ తెలంగాణ మావోయిస్టులపై సినిమా తీయలేదని అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, మావోయిస్టులు, నక్సలైట్లు గురించి తెల్సుకొని ప్రముఖ రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్రతో ఇవన్నీ సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు. కొండా మురళి, కొండా సురేఖల జీవిత కోణం నుంచి తెలంగాణ పరిస్థితులని, రాజకీయాలని చూపిస్తానని ప్రకటించాడు.

Kondapolam : కొండపొలం ట్రైలర్ విడుదల.. ఇది వైష్ణవ తేజ్ తిరుగుబాటు

ఇందుకోసం కొండా మురళి అనుమతి కూడా తీసుకున్నాను అని తెలిపాడు ఆర్జీవీ. ఆర్జీవీ జీవిత చరిత్రలను సినిమాలుగా తీస్తున్నాడు అంటే చాలా మంది అందులో ఏం చూపిస్తాడో అని భయపడతారు. తాజాగా కొండా మురళి బయోపిక్ ప్రకటించడంతో తెలంగాణలోని వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా ఆ సినిమాలో ఏం చూపిస్తాడని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాకి ”కొండా” అని టైటిల్ ని కూడా ఖరారు చేసేసాడు ఆర్జీవీ. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి.