RRR: ఆర్ఆర్ఆర్ 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రోజురోజుకూ తన క్రేజ్‌ను.....

RRR: ఆర్ఆర్ఆర్ 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా!

RRR

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రోజురోజుకూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ కొల్లగొడుతూ రెండో వారంలోకి అడుగుపెట్టింది.

RRR: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు జనం ఇంకా థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఈ సినిమాకు పెరుగుతున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా 10 రోజులు ముగిసేసరికి ఏకంగా రూ.496.80 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.

RRR: ఆర్ఆర్ఆర్ మేనియా.. జక్కన్నపై కంగనా పొగడ్తల వర్షం!

గ్రాస్ వసూళ్ల పరంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.900 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. కాగా 10 రోజులు ముగిసే సరికి ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.97.06 కోట్లు
సీడెడ్ – రూ.44.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.30.05 కోట్లు
ఈస్ట్ – రూ.13.75 కోట్లు
వెస్ట్ – రూ.11.60 కోట్లు
గుంటూరు – రూ.16.31 కోట్లు
కృష్ణా – రూ.12.98 కోట్లు
నెల్లూరు – రూ.12.98 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.234.50 కోట్లు(షేర్) (రూ.351.15 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.37.15 కోట్లు
తమిళనాడు – రూ.33.70 కోట్లు
కేరళ – రూ.9.25 కోట్లు
హిందీ – రూ.91.10 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.6.90 కోట్లు
ఓవర్సీస్ – రూ.84.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.496.80 (షేర్) (రూ.900 కోట్లు గ్రాస్)