Naveen Patnaik: ఒడిశా మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేడీ క్లీన్ స్వీప్: దరిదాపుల్లో కూడా లేని బీజేపీ, కాంగ్రెస్

ఒడిశాలో శనివారం వెలువడిన మునిసిపల్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అత్యధిక సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది

Naveen Patnaik: ఒడిశా మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేడీ క్లీన్ స్వీప్: దరిదాపుల్లో కూడా లేని బీజేపీ, కాంగ్రెస్

Bjd

Naveen Patnaik: ఒడిశాలో శనివారం వెలువడిన మునిసిపల్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అత్యధిక సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 108 స్థానాలకు గానూ 76 స్థానాలను బీజేడీ కైవసం చేసుకోగా 16 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు మిగతా స్థానాల్లో గెలుపొందారు. గెలుపొందిన అన్ని స్థానాల్లోనూ మేయర్, చైర్ పర్సన్ పదవులను అధికార పార్టీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో మునిసిపల్ చట్టం సవరించిన అనంతరం మొదటిసారి నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రజలే మేయర్, మునిసిపల్ చైర్ పర్సన్ లను ఎన్నుకొనే విధంగా ఓటు హక్కు కల్పించారు. గత నెలలో ఒడిశాలోని 30 జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ 852 జిల్లా పరిషద్ స్థానాలకు గానూ 766 స్థానాల్లో బీజేడీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఇక ఈ రెండు ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ లు అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేకపోయాయి.

Also Read:Petrol In India : కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఆ ప్రభావం ఒడిశాలో ఏ మాత్రం కనిపించలేదు. ఈవిజయాన్నిభట్టి చూస్తుంటే ఇప్పుడపుడే ఒడిశాలో బీజేడీకి మరో ప్రత్యామ్న్యాయం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయత్, మున్సిపల్ ఎన్నికలో బీజేడీకి ప్రజలు తిరుగులేని పట్టం కట్టడంపై ఆపార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. ఏళ్లకేళ్లుగా తమను ఆదరిస్తున్న ఒడిశా ప్రజలకు రుణపడి ఉంటానని.. బీజేడీపై ఒడిశా ప్రజలు చూపిస్తున్న ప్రేమకు సదా సేవకుడిగా వ్యవహరిస్తానంటూ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల ఫలితాలను బేరీజు వేస్తె ఒడిశాలో బీజేపీ క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.

Also Read:Political Speeches: చిరునవ్వు ప్రసంగాలు నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్ట్