Sagar K Chandra : ‘భీమ్లా నాయక్’ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ మూవీ మెగా హీరోతోనేనా??

ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి టాలీవుడ్ లో సాగర్ బిజీ అవుతాడు అని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు సాగర్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు............

Sagar K Chandra : ‘భీమ్లా నాయక్’ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ మూవీ మెగా హీరోతోనేనా??

Sagar Chandra

Sagar K Chandra :   భీమ్లా నాయక్ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చాడు డైరెక్టర్ సాగర్ కే చంద్ర. అనసూయ, అమరావతి.. లాంటి సినిమాలకు రవిబాబు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ‘అయ్యారే’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత నారా రోహిత్, శ్రీ విష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు దక్కించుకున్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాగర్ చంద్ర ఇటీవల పవన్, రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో మరోసారి తెరపైకి వచ్చాడు. ఈ సినిమాకి వెనకుండి మాటలు రాసింది త్రివిక్రమ్ అయినా ముందుండి తెరమీద అద్భుతంగా చూపించింది మాత్రం సాగర్ చంద్రనే. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి టాలీవుడ్ లో సాగర్ బిజీ అవుతాడు అని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు సాగర్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు.

Junaid Shek : సమంత అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది

సాగర్ ‘భీమ్లా నాయక్’ తో హిట్ కొట్టడంతో మరోసారి మెగా హీరోతోనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే సాగర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కి కథ వినిపించాడు. కథ కూడా ఓకే అయిపొయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ వరకు రాకుండానే ఆగిపోయింది. అయితే బాబాయికి హిట్ ఇవ్వడంతో వరుణ్ తేజ్ అప్పటి సినిమాని సాగర్ తో కలిసి పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు.

Jhund : నిర్మాతల కోసం పారితోషికం తగ్గించుకున్న అమితాబ్..

‘భీమ్లా నాయక్’ చూసిన తర్వాత సాగర్ ని వరుణ్ పిలిచి మరీ మాట్లాడాడట. ప్రస్తుతం వరుణ్ నుంచి గని, ఎఫ్ 3 సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత ఇంకా ఏ సినిమాని అన్నౌన్స్ చేయలేదు. ఈ రెండు రిలీజ్ కి రెడీ అవ్వడంతోఈ ప్రస్తుతం వరుణ్ ఖాళీగానే ఉండి కథలు వింటున్నాడు. దీంతో సాగర్ కి మరోసారి కథ చెప్పమని అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది కనుక వర్కౌట్ అయితే సాగర్ మరోసారి మెగా హీరోతో సినిమా చేసి సెట్ అవ్వడం గ్యారెంటీ. చూడాలి మరి ఏమవుతుందో.