Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..

టాలీవుడ్ పై బాగా ఫోకస్ పెంచారు సల్మాన్ ఖాన్. ఇక్కడి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఆయన్ని వాడుకోవాలని తెలుగు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒకరికొకరు............

Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..

Salman Khan

Tollywood :  టాలీవుడ్ పై బాగా ఫోకస్ పెంచారు సల్మాన్ ఖాన్. ఇక్కడి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఆయన్ని వాడుకోవాలని తెలుగు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒకరికొకరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సహరించుకుంటున్నారు. గాఢ్ ఫాదర్ లో చిరంజీవి సల్మాన్ ను వాడితే, మెగా పవర్ స్టార్ సల్మాన్ ఖాన్ బాకీ తీర్చేశారు.

రొటీన్ సినిమాలను ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదరించడంలేదు. దాంతో బాలీవుడ్ స్టార్ల దృష్టి వేరియేషన్ కోసం సౌత్ ఇండియా మీదకు షిఫ్ట్ అవుతోంది. మోహన్ రాజా డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యారెక్టర్ చేసి, చిరంజీవికి నార్త్ ఇండియా మార్కెట్ కోసం హెల్ప్ కాబోతుంటే, కబీఈద్ కబీ దివాలి సినిమాలో ఓ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సిగ్నేచర్ స్టెప్స్ తో స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఇక్కడి మార్కెట్ కోసం సల్మాన్ కు హెల్ప్ అవుతున్నారు. ఆల్రెడీ జూన్ 19న షూటింగ్ కూడా పూర్తి చేసిన చరణ్ ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు సల్మాన్ తో కలిసి.

Virataparvam : ప్రమోషన్స్ ఫుల్.. కలెక్షన్స్ నిల్.. సాయి పల్లవి క్రేజ్ కూడా పనికి రాలేదు..

సల్మాన్ ఖాన్ ఉపకారానికి ప్రత్యోపకారంగా చిరంజీవి కోకా పేటలోని తన ఆచార్య సెట్ లో ఫ్రీ లొకేషన్ అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే ఓ పాట చిత్రకరణ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ సరసన పూజాహెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం సల్మాన్ ఖాన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ శంకర్. సో ఇక ముందు కూడా సల్మాన్ ఖాన్ తెలుగులో ఏ హెల్ప్ చేసినా, రుణం ఉంచుకోకుండా వెంటనే తీర్చేస్తారన్నమాట. మరి సల్మాన్ తెలుగులో ఇంకా ఎన్ని సినిమాల్లో నటిస్తాడో చూడాలి.