Salman Khan : రవితేజని ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..

సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది.. రొటీన్‌గా కమర్షియల్ సినిమాలెందుకని ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా.. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు..

Salman Khan : రవితేజని ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..

Salman Khan

Salman Khan: సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. రొటీన్‌గా కమర్షియల్ సినిమాలెందుకని ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా.. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే సక్సెస్ ఫార్ములా ఇచ్చే సౌత్ మీద కాన్సన్‌ట్రేట్ చేశారు సల్మాన్. రీమేక్‌లతో సూపర్ హిట్ అందుకుంటున్న సల్మాన్ ఇంకా రిలీజే అవ్వని మరో తెలుగు మూవీతో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు.

‘రాధే’ రిలీజ్ అయినా.. అంతగా ఆడక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు సల్మాన్. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి చేతులు కాలడంతో మంచి సినిమాతో ట్రాక్‌లోకి వద్దామని డిసైడ్ అయ్యారు. అందుకే తనకు అచ్చొచ్చిన సౌత్ రీమేక్స్ మీద కాన్సన్‌ట్రేట్ చేశారు. రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, జస్ట్ ట్రైలర్‌కి ఫిదా అయ్యి రీమేక్ రైట్స్ కొనేశారు సల్మాన్. డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని డిసైడ్ అయ్యారు భాయ్.

సల్మాన్ ఇప్పుడే కాదు.. కెరీర్‌లో సౌత్ రీమేక్స్ అన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లే. స్పెషల్‌గా తెలుగు సినిమాల క్రేజ్ కూడా ఎక్కువే. 10 ఏళ్ల క్రితం క్రైసిస్‌లో ఉన్నప్పుడు మహేష్ బాబుకు కెరీర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘పోకిరి’ సినిమాని.. సల్మాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో ‘వాంటెడ్’ సినిమాగా రీమేక్ చేశారు. కొన్నాళ్ల నుంచి సక్సెస్ లేక ఫ్లాప్‌లో ఉన్న సల్మాన్‌కి.. ‘వాంటెడ్’ సినిమా కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. కెరీర్‌లో మరిచిపోలేనంత బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రామ్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రెడీ’ సినిమా కూడా ‘రెడీ’ పేరుతోనే రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు సల్మాన్.

కెరీర్ ఎప్పుడు డల్ అయినా.. సౌత్ రీమేక్ సల్మాన్‌కి మంచి సక్సెస్ అందించింది. అలా ‘బాడీగార్డ్’ కూడా సల్మాన్ ఖాన్‌కి సూపర్ హిట్ ఇచ్చింది. తెలుగులో ‘స్టాలిన్’ గా వచ్చిన సినిమాని ‘జైహో’ గా రీమేక్ చేసి మంచి టాక్ సంపాదించుకున్నారు సల్మాన్. ఇక రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్’ సినిమాని హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు రవితేజ మరో సినిమా ‘ఖిలాడీ’ తోనే ఫ్లాపుల్లో నుంచి బయట పడబోతున్నారని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు సల్మాన్ ఖాన్.