RRR-Radhe Shyam: సంక్రాంతి సినిమాలు.. ఫుల్‌గా ఆర్ఆర్ఆర్.. డల్‌గా రాధేశ్యామ్!

జనవరి సినిమాల రిలీజ్ హడావిడి స్టార్టయ్యింది. 15రోజుల్లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్ తో ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. అదే 20 రోజుల్లో రిలీజ్..

RRR-Radhe Shyam: సంక్రాంతి సినిమాలు.. ఫుల్‌గా ఆర్ఆర్ఆర్.. డల్‌గా రాధేశ్యామ్!

Rrr Radhe Shyam

RRR-Radhe Shyam: జనవరి సినిమాల రిలీజ్ హడావిడి స్టార్టయ్యింది. 15రోజుల్లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్ తో ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. అదే 20 రోజుల్లో రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ మాత్రం ఇంకా పోస్టర్ల రిలీజ్ దగ్గరే ఆగిపోయింది. పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న రెండిట్లో ట్రిపుల్ఆర్ ఫుల్ గా ప్రమోషన్లు చేస్తుంటే.. రాధేశ్యామ్ మాత్రం ఇంకా డల్ గానే ఉంది.

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

జనవరికి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయంటే.. టీజర్లు, ట్రైలర్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అంటూ ప్రమోషన్లు మోత మోగిపోతూ ఉండాలి. అయితే జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ఈ ఇష్యూలో ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్లు చేస్తుంటే.. రిలీజ్ కు ఇంకా నెల రోజులు కూడా లేని రాధేశ్యామ్ ఇంకా ప్రమోషన్ల విషయలో డల్ గానే ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్స్ లో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కు ఇంకా 15 రోజులే ఉండడంతో ట్రిపుల్ ఆర్ టీమ్ అప్ డేట్స్ తో హోరెత్తించేస్తోంది.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

జనవరి 7న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్లతో టీమ్ తో పాటు ఆడియన్స్ లో పుల్ జోష్ తెప్పిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్, ఫోటోస్, రీల్స్.. ఇలా వరుస పెట్టి ప్రమోషన్ కి పనికొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు అనడం కంటే.. ప్రతి దాన్నీ ప్రమోషన్లకోసం వాడుతున్నారు అనడం కరెక్ట్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో హై యాక్షన్ ఎలివేషన్స్ తో అంతకుమించిన ఎమోషన్స్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ జనవరి 7న ఆడియన్స్ ముందుకురాబోతోంది.

RRR: బ్లాస్టింగ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

ట్రిపుల్ఆర్ జనవరి 7న రిలీజ్ అవుతుంటే.. రాధేశ్యామ్ ఇంకో వారం తర్వాత అంటే జనవరి 14న పండగరోజు రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ అవుతోంది. ప్రభాస్, పూజాహెగ్డే కాంబినేషన్లో తెరకెక్కుతున్నరొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్రమోషన్ల విషయంలో మాత్రం ఇంకా డల్ గానే ఉంది. ఫస్ట్ నుంచి అప్ డేట్స్ విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న రాదేశ్యామ్ రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా కూడా ఏమాత్రం మారలేదు.

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు సౌత్ మార్కెట్ తో పాటు నార్త్ మార్కెట్ కూడా ప్రభాస్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తోంది. అలాంటప్పుడు ప్రమోషన్లతో కలెక్షన్ల స్టామినా పెంచుకోవాలి కానీ.. ఇలా స్లోగా ప్రమోషన్లు చేస్తే ఆడియన్స్ రీచబిలిటీ తగ్గుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఒక పక్క ట్రిపుల్ఆర్ ఏఅవకాశాన్నీ వదులుకోకుండా వీడియోలు, ఈవెంట్లు చేస్తూ.. సినిమాని ఎక్కడికో తీసుకెళుతుంటే.. రాధేశ్యామ్ మాత్రం ఇంకా వారానికో పోస్టర్ రిలీజ్ చేస్కుంటూ నత్తనడకన ప్రమోషన్ చేస్తోంది.