Senior Heroins : రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్స్..

కప్పుడుసిల్వర్ స్క్రీన్ ని ఏలిన యాక్టర్లు ఇప్పుడు మళ్లీ రంగేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తో రెడీ అవుతున్నారు. ఈమధ్య కొత్త కొత్త స్టార్లతో పాటు ఒకప్పుడు టాప్ స్టార్లుగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టాప్ స్టార్స్ ని.........

Senior Heroins : రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్స్..

Heroins

Senior Heroins :  ఒకప్పుడుసిల్వర్ స్క్రీన్ ని ఏలిన యాక్టర్లు ఇప్పుడు మళ్లీ రంగేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తో రెడీ అవుతున్నారు. ఈమధ్య కొత్త కొత్త స్టార్లతో పాటు ఒకప్పుడు టాప్ స్టార్లుగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టాప్ స్టార్స్ ని కూడా తెరమీదకి తీసుకొస్తోంది టాలీవుడ్. అలా సరికొత్తగా తెలుగు తెరమీదకొస్తున్న క్రేజీ సీనియర్స్ చాలా మండే ఉన్నారు. యంగ్ లో ఉన్నప్పుడు తెలుగు సినిమాల్లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన స్టార్లు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.

10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెర మీద సందడి చెయ్యబోతోంది మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్. రోబో సినిమా తర్వాత సౌత్ ఆడియన్స్ కి దూరంగా ఉన్న ఐశ్వర్య మళ్లీ మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు సంబందించి మహారాణిగా లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

హహ హాసినిగా తెలుగు ప్రేక్షకులకి తెగ నచ్చేసిన జెనీలియా బొమ్మరిల్లుతో టాప్ హీరోయిన్ అయిపోయింది. సౌత్ స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసిన జెనీలియా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సౌత్ లో రీఎంట్రీ ఇస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి సినిమాతో మళ్లీ ఒకేసారి కన్నడ, తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది.

విరాట పర్వం సినిమాతో మరో టాలెంటెడ్ హీరోయిన్ నందితా దాస్ రీ ఎంట్రీ ఇచ్చారు. 2006లో కమిలి సినిమాలో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న నందితా మళ్లీ 15 ఏళ్ల తర్వాత విరాటపర్వంతో రీ ఎంట్రీ ఇచ్చారు.

Aishwarya Rai : 48 ఏళ్ల వయసులో యువ హీరోయిన్‌లా మెరిపిస్తున్న ఐష్..

హీరోయిన్స్ అంటే ఫెయిర్ గా ఉండాలనే సో కాల్డ్ రూల్ ని బ్రేక్ చేసి సౌత్ లో తన పర్ఫామెన్స్ తో వండర్స్ క్రియేట్ చేసింది డస్కీ బ్యూటీ అర్చన. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేసిన ఈ హీరోయిన్ దాదాపు పాతికేళ్ల తర్వాత ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు.

తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్న మరో సీనియర్ హీరోయిన్ అమల. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగార్జునని పెళ్లి చేసకున్న ఈ స్టార్ హీరోయిన్ 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తల్లిగా కనిపించింది. మనం సినిమాలో ఏదో అలా వచ్చినా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సారి కాస్త ఎక్కువ స్పేస్ ఉన్న సినిమా చేస్తున్నారు. శర్వానంద్ ఒకేఒక జీవితం సినిమాలో శర్వాకి అమ్మగా కీరోల్ లో రీఎంట్రీ ఇస్తున్నారు అమల.

ప్రేమపావురాలు సినిమాతో ఇండియాని మొత్తం ఊపేసిన క్యూట్ హీరోయిన్ భాగ్యశ్రీ. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా మరికొంతమంది సీనియర్ హీరోయిన్స్ వీళ్ళ బాటలోనే మళ్ళీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వవలని చూస్తున్నారు.