Aishwarya Rai : 48 ఏళ్ల వయసులో యువ హీరోయిన్‌లా మెరిపిస్తున్న ఐష్..

పొన్నియన్ సెల్వన్ లో పగ, ప్రతీకారానికి అందమైన రూపంగా నందిని దేవి, మందాకిని గా టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఐశ్వర్య రాయ్ నటించినట్టు. దాదాపు పన్నేండేళ్ల క్రితం రావణన్ సినిమా కోసం మణిరత్నం డైరెక్షన్ లోనే......

Aishwarya Rai : 48 ఏళ్ల వయసులో యువ హీరోయిన్‌లా మెరిపిస్తున్న ఐష్..

Aishwarya Rai

Aishwarya Rai :  48 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల హీరోయిన్ లాగా కనిపిస్తోంది ఐశ్వర్య రాయ్, ఆ అందం చూస్తే, యంగ్ హీరోయిన్స్ కే అసూయపుడుతోంది. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ రీసెంట్ గా కాన్స్ ఫెస్టివల్ లో మెరిసింది. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ లో అందర్నీ డామినేట్ చేసి, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.

కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతుంది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఇటీవలే ఈ సినిమా పార్ట్ 1 టీజర్ రిలీజ్ అయింది. భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ఈ టీజర్ లో ఐశ్వర్య రాయ్ క్లోజ్ షాట్ తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొడుతోంది. భారీతారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ అందం అందర్నీ డామినేట్ చేసింది. దాంతో ఆమె అందాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో ఐష్ జపం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Ram Pothineni : పూరి గారితో మళ్ళీ సినిమా చేస్తా.. ఇస్మార్ట్ శంకర్‌కి మించి..

పొన్నియన్ సెల్వన్ లో పగ, ప్రతీకారానికి అందమైన రూపంగా నందిని దేవి, మందాకిని గా టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఐశ్వర్య రాయ్ నటించినట్టు. దాదాపు పన్నేండేళ్ల క్రితం రావణన్ సినిమా కోసం మణిరత్నం డైరెక్షన్ లోనే విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్య రాయ్ మళ్లీ వీళ్ల కాంబినేషన్ లో పొన్నియన్ సెల్వన్ సినిమాతో కంబ్యాక్ ఇస్తోంది. పొన్నియన్ సెల్వన్ 1 సెప్టెంబర్ 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

రోబోలో తన గ్లామర్ కి మనుషులేంటి మరమనుషులు సైతం ఫ్లాట్ అయిపోతారని నిరూపించిన ఐశ్వర్య, ఈమధ్య కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందం, హుందాతనంతో రెడ్ కార్పెట్ పైన వాక్ చేసి, అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. పొన్నియన్ సెల్వన్ తో అందానికి, ఏజ్ కి సంబంధమే లేదని ప్రూవ్ చేసి, సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక పొన్నియన్ సెల్వన్ రిలీజ్ అయితే ఆమె అందం ఇంకెంత మందిని ఫ్లాట్ చేస్తుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి మరోసారి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తూ యువ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది ఐష్.