Sikh Groups : జమ్ములో సిక్కుల ఆందోళన, జోలికి వస్తే సహించమంటున్న సిక్కులు

శుక్రవారం సిక్కులు రోడ్ల మీదకు వచ్చారు. శ్రీనగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో వీరు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sikh Groups : జమ్ములో సిక్కుల ఆందోళన, జోలికి వస్తే సహించమంటున్న సిక్కులు

Sikh

Sikh Groups Protest : ముష్కరులు వ్యూహాలు మార్చారు. ఇంతవరకు…భారత బలగాలను టార్గెట్ చేస్తూ..వచ్చిన వీరు..సాధారణ పౌరులను హతమారుస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. జమ్ము శ్రీనగర్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఐదు రోజుల్లో ఏడుగురు సామాన్యులను మిలిటెంట్స్ పొట్టన పెట్టుకోవడం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం ఓ సిక్కు ప్రిన్స్ పాల్ ను ఉగ్రవాదులు కాల్చి చంపడంపై ఆ వర్గానికి చెందిన వారు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం సిక్కులు రోడ్ల మీదకు వచ్చారు. శ్రీనగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో వీరు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య ప్రజలను టార్గెట్ చేయడాన్ని ఖండిస్తూ..వీరు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న సిక్కులను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు.

Read More : Supreme Court: అక్రమాస్తుల కేసులో ఏపీ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సిక్కులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వీరంతా ఆందోళనకు దిగారు. సామాన్య ప్రజలను టార్గెట్‌ చేయడంమేంటంటూ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. శ్రీనగర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చారు సిక్కులు. తమ జోలికి వస్తే సహించేదే లేదంటున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే 25 మంది పౌరులను ఉగ్రవాదులు హతమార్చగా ముగ్గురు స్థానికేతరులున్నారు. ఇద్దరు కశ్మీరీ పండిట్లు, 18 మంది స్థానిక ముస్లింలున్నారు. శ్రీనగర్‌లోనే ఎక్కువగా పది దాడులు జరిగాయి. దీనిపై అటు మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సుమారు 50 నుంచి 60 కశ్మీరీ పండిట్‌ కుటుంబాలు జమ్మూ ప్రాంతానికి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఇలాంటి సమయంలో సిక్కులను కాల్చిచంపడం మరింత ఆందోళన కలిగిస్తోంది.