covid-19: ఒకేరోజు వెయ్యి దాటిన కోవిడ్ కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

covid-19: ఒకేరోజు వెయ్యి దాటిన కోవిడ్ కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి

covid-19: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 5,30,802గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ వల్ల ముగ్గురు మరణించారు. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 4.46 కోట్లు (4,46,95,420)గా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.1గా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.8 కాగా, మరణాల శాతం 1.19 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయి.

కాగా, దేశంలో ఇటీవల వరుసగా కోవిడ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు నెలల తర్వాత మళ్లీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది.