Sitara: గుర్రపుస్వారీలో అదరగొడుతున్న సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని తెగ సందడి చేస్తోంది. పలు యూట్యూబ్ వీడియోల్లో సితార పాప చేస్తున్న...

Sitara: గుర్రపుస్వారీలో అదరగొడుతున్న సితార

Sitara Learns Horse Riding

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని తెగ సందడి చేస్తోంది. పలు యూట్యూబ్ వీడియోల్లో సితార పాప చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఇక రీసెంట్‌గా తన తొలి సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఇచ్చేసింది ఈ బేబీ. తన తండ్రి మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్‌లో వెండితెరపై మెరిసి అందరిచేత శభాష్ అనిపించుకుంది.

Sitara Ghattamaneni: సితార సోషల్ మీడియా ప్రమోషన్.. గ్రౌండ్ వర్క్ దేనికి..?

ఇక ఇటీవల తన కూతురు కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మురిసిపోయారు మహేష్ దంపతులు. అయితే తాజాగా సితార గుర్రపుస్వారీ కూడా నేర్చుకుంటోంది. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. గుర్రపుస్వారీ అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే చాలా శ్రద్ధగా గుర్రపుస్వారీ నేర్చుకున్నట్లుగా సితార పేర్కొంది. ఇక తనకు ట్రెయినింగ్ ఇచ్చిన ట్రైనర్స్‌కు ఈ సందర్భంగా ఆమె స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

Sitara Ghattamaneni: సితార స్పెషల్ డాన్స్.. వీడియో షేర్ చేసిన మహేష్!

త్వరలోనే తాను నేర్చుకున్న గుర్రపుస్వారీ విద్యను అందరికీ చూపించబోతున్నట్లు ఆమె పేర్కొంది. అయితే తనకు గుర్రపుస్వారీ ట్రెయినింగ్‌లో ఇచ్చిన రెండు గుర్రాలు కూడా తనకు ఎంతగానో నచ్చాయని, వాటిపై తనకు ఇష్టం ఏర్పడిందని సితార చెప్పుకొచ్చింది. ఇలా అన్ని రంగాలకు చెందిన విద్యలను నేర్చుకుంటున్న సితార భవిష్యత్తులో మరిన్ని విద్యలను అభ్యసించాలని ఘట్టమనేని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం సితార గుర్రపుస్వారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)