Bigg Boss 5: ఎలిమినేషన్ జోన్‏లో ఆరుగురు.. గండం నుంచి గట్టెక్కేదెవరు?

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి రోజే కాస్త కాంట్రవర్సీ, ఇంకాస్త ఎమోషన్ అన్నట్లు సాగింది. కంటెస్టెంట్ల ఫోటోలను చెత్త మూటల మీద ముద్రించి కంటెస్టెంట్లకు నచ్చని మూటని ఒక చెత్తకుండీలో..

Bigg Boss 5: ఎలిమినేషన్ జోన్‏లో ఆరుగురు.. గండం నుంచి గట్టెక్కేదెవరు?

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి రోజే కాస్త కాంట్రవర్సీ, ఇంకాస్త ఎమోషన్ అన్నట్లు సాగింది. కంటెస్టెంట్ల ఫోటోలను చెత్త మూటల మీద ముద్రించి కంటెస్టెంట్లకు నచ్చని మూటని ఒక చెత్తకుండీలో పడేయాలని తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు రాజేశాడు బిగ్ బాస్. ఎవరికి వారు వారికి నచ్చని కారణాలతో ఇద్దరిని ఎలిమినేట్ జాబితాకు నామినేట్ చేశారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నారని కొందరిని.. ఇంత అమాయకం ఉంటే హౌస్ లో ఉండలేవని మరికొందరిని కూడా ఈ ఎలిమినేషన్ జాబితాకు చేర్చారు కంటెస్టెంట్లు.

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ పులిహోర రాజా ‘సన్నీ’నేనా?

సింగర్ శ్రీరామచంద్ర.. తనకు పరిచయంలేరని మానస్, జెస్సీలను నామినేట్ చేస్తే; సరయు.. కాజల్‏కు గేమ్ స్ట్రాటజీ తెలుసని.. రవి తనకు గట్టి కాంపిటేటర్ అని నామినేట్ చేసింది. ఇక శ్వేత.. హమిద, నటరాజ్‌లను, విశ్వ.. జెస్సీ, మానస్‏లను; జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్‌, జెస్సీలను నామినేట్‌ చేశారు. రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్‌ చేసిన కారణంగా జెస్సీని నామినేట్‌ చేసింది హమీదా. టాస్క్‌లు చెప్పడం నచ్చలేదని సన్నీని, జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను షణ్ముఖ్‌ నామినేట్‌ చేస్తే; యాటిట్యూడ్‌ చూపించిందని ప్రియను, కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ చూశాడని లోబో రవిని నామినేట్‌ చేశాడు.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వీళ్ళే.. ఎవరు మీ ఫేవరెట్?

అలా మొదటివారం ఇంట్లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో నామినేషన్‌ ప్రక్రియలో ఆరుగురు కంటెస్టెంట్లకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. తొలి వారమే కావడంతో ఎవరికి వారు ఎలాంటి దాపరికాలు లేకుండా.. నచ్చని వారి మీద ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే చేసిన ఈ నామినేషన్ ప్రక్రియ హీట్ హీట్‏గా సాగింది. ఇందులో యాంకర్ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉండగా ఈవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం నామినేట్‌ అయినట్లు పేర్లను బిగ్‌బాస్‌ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్‌ గండం గట్టెక్కేది ఎవరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.