Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో కల్లోలం..! రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి? కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్?

Bandi Sanjay : కీలక మార్పుల వార్తలతో తెలంగాణ కమలదళంలో మళ్లీ కల్లోలం మొదలైంది. బండి సంజయ్ ను మార్చడంపైన బీజేపీలో మరో వర్గంలో అసమ్మతి జ్వాలలు నెలకొన్నాయి.

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో కల్లోలం..! రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి? కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్?

Bandi Sanjay

Bandi Sanjay – Kishan Reddy : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా బీజేపీ హైకమాండ్.. పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాషాయ దళపతి మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. అలాగే కేంద్ర కేబినెట్ లోనూ మార్పులకు అవకాశం ఉంది. రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉంది. దీంతో తెలంగాణలోనూ మార్పు తప్పదని సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ టీ-బీజేపీ పగ్గాలు మరొకరికి అప్పగిస్తే.. బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే చాన్స్ ఉంది.

Also Read: బోధన్ సిటింగ్ ఎమ్మెల్యేకు కఠిన పరీక్ష.. బీఆర్‌ఎస్‌కు సవాళ్లు ఎన్నో.. హ్యట్రిక్ సాధిస్తారా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు అధికంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ కి నరేందర్ సింగ్ తోమర్, రాజస్థాన్ కి గజేందర్ సింగ్ షెకావత్, ఒడిశాకి ధర్మేంద్ర ప్రదాన్ లను అధ్యక్షులుగా పంపే చాన్స్ ఉంది.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రచార కమిటీ సారధ్యం అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే రఘునందన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, కీలక మార్పుల వార్తలతో తెలంగాణ కమలదళంలో మళ్లీ కల్లోలం మొదలైంది. బండి సంజయ్ ను మార్చడంపైన బీజేపీలో మరో వర్గంలో అసమ్మతి జ్వాలలు నెలకొన్నాయి.

కొందరి ఒత్తిడితోనే ఈ మార్పులు చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీకి ఊపు తెచ్చిన ఘనత సంజయ్ దేనంటూ వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఎన్నికల ముందుకు మార్పు మంచిది కాదంటోంది బండి సంజయ్ వర్గం. స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షాలే భుజం తట్టిన బండి సంజయ్ నే కొనసాగించాలని అంటున్నారు.

Also Read: ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి

కొత్తగా బీజేపీలోకి వచ్చిన ఒకరిద్దరు నేతలకు నచ్చనంత మాత్రాన అధ్యక్షుడిని ఎలా మార్చుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక, బండి సంజయ్ మార్పును ఆర్ఎస్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. బండి సంజయ్ ను మారిస్తే పార్టీ రెండు వర్గాలుగా చీలే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ కు కొత్త తల నొప్పి మొదలైంది.