Sunny Leone: వంటలక్కగా మారిన సన్నీ లియోన్.. అంతా ఆ హీరో వల్లే!

శృంగార తారగా సన్నీ లియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు రావడంతో ఆమె సినిమాలకే ఎక్కువ....

Sunny Leone: వంటలక్కగా మారిన సన్నీ లియోన్.. అంతా ఆ హీరో వల్లే!

Sunny Leone Turns Cook For Manchu Vishnu

Sunny Leone: శృంగార తారగా సన్నీ లియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు రావడంతో ఆమె సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఇక బాలీవుడ్‌లో ఆమె చేసిన పాత్రలకు కూడా మంచి గుర్తింపు రావడంతో ఆమెకు ఇండియావైడ్‌గా అభిమానులు ఉన్నారు. అయితే ఈ బ్యూటీ దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంట్ తీగ’ సినిమాలో ఓ కీలక పాత్రలో సన్నీ నటించి మెప్పించింది. అటుపై రాజశేఖర్ గరుడవేగ సినిమాలో ‘‘డియో డియో..’’ అనే పాటలో చిందులేని కుర్రకారును తన అందాల ఎరతో ఊపేసింది.

Sunny Leone: సన్నీ ఫ్యాన్స్‌కు చికెన్ షాప్ ఓనర్ బంపరాఫర్

అయితే చాలా కాలం తరువాత ఇప్పుడు సన్నీ లియోన్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో సన్నీ లియోన్ నటిస్తోంది. మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్‌ను ఏకంగా వంటలక్కగా మార్చేశాడు మంచు వారి హీరో. వంటమనిషి అవతారమెత్తిన సన్నీ లియోన్ తాను చేసిన వంట గురించి మంచు విష్ణుకు వివరంగా తెలియజేసింది.

Sunny Leone: సన్నీ దెబ్బకు పరుగులు పెట్టిన మంచు విష్ణు.. మీమర్స్‌కు కొత్త స్టఫ్!

ఇక మంచు విష్ణు ఆమెకు తెలుగు పదాలు నేర్పుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ లియోన్ తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. సన్నీలియోన్‌ను వంటమనిషిని చేశావు కదా అంటూ మంచు విష్ణుపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది ఆమెను అచ్చతెలుగు అమ్మాయిలా చీరలో బాగున్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదేమైనా చేసిన ఏ పనినైనా వైరల్ ఎలా చేయాలో సన్నీ లియోన్‌ను చూసి నేర్చుకోవాలని పులువురు నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)